Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్‌వెల్త్: రెండో రోజు మెరిసిన భారత్ (పిక్చర్స్)

గ్లాస్గో: కామన్‌వెల్త్ క్రీడల్లో రెండు రోజు గురువారం భారత్ శుభారంభం చేసింది. కామన్‌వెల్త్ క్రీడాపోటీలు బుధవారం ప్రారంభమైన తర్వాత పోటీలు గురువారం జరిగాయి. భారత అథ్లెట్లు ఏడు పతకాలు సాధించారు. వాటిలో రెండు స్వర్ణపతకాలు ఉన్నాయి.

భారత్‌కు ఏడు పతకాలు కూడా జూడోలో, వెయిట్ లిఫ్టింగ్‌లో వచ్చాయి. కె. సంజిత చాను ఈ ఏడాది భారత్‌కు తొలి స్వర్ణపతకాన్ని అందించారు. మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమంగా నిలిచింది. ఇదే విభాగంలో సాయికోమ్ మీరాబాయి వెండి పతకం సాధించింది.

రెండో స్వర్ణ పతకాన్ని సుఖేన్ డే సాధించారు. జూడోలో 56 కిలోల విభాగంలో అతను స్వర్ణపతకం సాధించాడు.

స్వర్ణ పతకం

స్వర్ణ పతకం

భారత్‌కు చెందిన కె. సంజితా చాను మహిళా వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.

నవజోత్ కండరాల నొప్పితో..

నవజోత్ కండరాల నొప్పితో..

భారత్‌కు చెందిన నవజోత్ చానా కండరాల నొప్పితో జూడోలో 60 కిలోల విభాగంలో ఇంగ్లాండుకు చంెదిన ఆష్లే మెకంజీ చేతిలో ఓడిపోయాడు. అయితే, నవజోత్ వెండి పతకం సాధించాడు.

పతకంతో సంజిత

పతకంతో సంజిత

గ్లాస్గోలో స్వర్ణ పతకం ధరించి ఆనందోత్సాహాల మధ్య సంజిత ఇలా కనిపించింది. భారత్‌కు ఈ ఏడాది తొలి స్వర్ణపతకాన్ని అందించింది.

చాను ఇలా..

చాను ఇలా..

భారత్‌కు చెందిన చాను సాయికోమ్ వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో వెండి పతకం సాధించింది.

వెండి పతకంతో నవజోత్

వెండి పతకంతో నవజోత్

జూడోలో నవజోత్ వెండి పతకం సాధించి, ఇలా ఆ పతకంతో కనిపించాడు.

టేబుల్ టెన్నిస్

టేబుల్ టెన్నిస్

టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో వానౌతుకు చెందిన యోషువా శింగ్, అలన్ లిన్ జోడీతో తలపడిన భారత్ సనీల్ శెట్టి, అమల్‌రాజ్ అర్పుతరాజ్

నవజోత్ ఇలా...

నవజోత్ ఇలా...

జూడో 60 కిలోల విభాగంలో ఇంగ్లాండుకు చెందిన ఆష్లే మెకంజీతో తలపడుతూ భారత్‌కు చెందిన నవజోత్

స్క్వాష్

స్క్వాష్

పురుషుల స్క్వాష్ సింగిల్స్ పోటీల్లో కెన్యాకు చెందిన హర్దీప్ రీల్‌తో తలపడిన భారత్ మహేష్ మంగౌకర్.

భారత పతాక రెపరెపలు

భారత పతాక రెపరెపలు

సంజిత 48 కిలోల విభాగంలో స్వర్ణపతకం సాధించగానే భారత జాతీయ పతాక రెపరెపలాడింది.

వెండి పతకంతో సుశీల

వెండి పతకంతో సుశీల

మహిళా జూడో పోటీల 48 కిలోల విభాగంలో వెండి పతకాన్ని సాధించిన తర్వాత భారత్‌కు చెందిన సుశీల ఇలా..

సుశీల ఇలా..

సుశీల ఇలా..

మహిళా జూడో 48 కిలోల విభాగం ఫైనల్ పోటీల్లో స్కాట్లాండ్‌కు చెందిన కింబెర్లీ రెనిక్స్‌తో తలపడిన భారత అథ్లెట్ సుశీల

స్వర్ణపతకంతో సంజిత

స్వర్ణపతకంతో సంజిత

స్వర్ణపతకంతో సంజిత ఫోజు ఇస్తూ ఇలా కనిపించింది.

హర్మీత్ ఇలా..

హర్మీత్ ఇలా..

పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీల్లో వానౌతుకు చెందిన హామ్ లులుతో తలపడుతూ భారత్‌కు చెందిన హర్మీత్ రాజుల్ దేశాయ్ ఇలా..

పతక విజేతలు

పతక విజేతలు

వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో భారత స్వర్ణపతక విజేత సంజిత (మధ్యలో), వెండి పతక విజేత చాను సాయికోమ్ (ఎడమ పక్కన), రజత పతక విజేత నైజీరియాకు చెందిన ఓపెరా ఎన్‌కెచి

చాను ఇలా..

చాను ఇలా..

మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో భారత్ అథ్లెట్ చాను సాయికోమ్ ఇలా ఎత్తుతూ

చాను హర్షాతిరేకాలు

చాను హర్షాతిరేకాలు

మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో వెండి పతకాన్ని సాధించిన తర్వాత సాయికోమ్ ఇలా హర్షాతిరేకంతో..

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+