ఎవరెస్ట్‌పై హ్యూస్ జ్ఞాపకాలు: బ్యాట్, జెర్సీలతో వెళ్లనున్న చురిమ్
ఖాట్మాండు: బంతి తగిలి మృతి చెందిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ జ్ఞాపకాలను ప్రపంచ అత్యున్నత శిఖరం ఎవరెస్ట్‌పైకి తీసుకెళ్లాలని నేపాల్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. హ్యూస్ ఉపయోగించిన బ్యాట్‌తో పాటు అతను వాడిన రెండు జెర్సీలను ప్రముఖ పర్వతారోహకురాలు చురిమ్ షెర్పా ఎవరెస్ట్ పైకి తీసుకెళ్లనుంది.
ఎవరెస్ట్‌ను రెండుసార్లు ఎక్కి రికార్డు సృష్టించిన చురిమ్.. హ్యూస్‌కు నివాళి అర్పించడానికి మరోసారి ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధమయ్యారు. హ్యూస్ జ్ఞాపకంగా ప్రపంచంలోకెల్లా ఎత్త్తెన ఎవరెస్ట్ పర్వతంపై అతను వాడిన వస్తువులను తీసుకెళ్లబోతున్నామని తెలిపారు.

ఇది నేపాల్ క్రికెట్ సంఘం ఫిలిప్ హ్యూస్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని, ఇది ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తోందని చూరిమ్ చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ బంతి తగిలి గత ఏడాది నవంబర్ 27వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే.
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 17వ తేదీన చురిమ్ షెర్పా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆమె లుక్లా నుండి ఆరు రోజుల పాటు ట్రెక్కింగ్ చేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుంటారు. ఆమె మే 17 నుండి 25 మధ్య ఎవరెస్ట్ పైకి చేరుకుంటారు. తిరిగి మే 31వ తేదీన ఖాట్మాండ్ చేరుకునే అవకాశముంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications