Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యూస్ ధరించింది పాత మోడల్ హెల్మెట్...: మాసురి

న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ న్యూ సౌత్ వేల్స్ బౌలర్ వేసిన బంతికి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఫిలిప్ హ్యూస్ పరిస్ధితి విషమంగానే ఉంది. చికిత్స కోసం అతడిని కృత్రమ కోమాలోకి తీసుకెళ్లిన విషమం తెలిసిందే.

ఫిలిప్ హ్యూస్ హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం బ్యాట్స్‌మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, లండన్‌కు చెందిన ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీ సంస్ధ 'మాసురి' స్పందించింది. హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది.

తమ కొత్త మోడల్ హెల్మెట్‌ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని స్పష్టం చేసింది. కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్ మెన్‌కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని 'మాసురి' వర్గాలు వివరించాయి.

Phil Hughes head injury: Older model helmet the reason?

లండన్‌కు చెందిన 'మాసురి' క్రికెట్ ఉపకరణాల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. హ్యూస్‌కు తల వెనుక మెడ భాగంలో బలంగా దెబ్బ తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని 'మాసురి' పేర్కొంది. ఫిలిప్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.

షెఫీల్డ్ షీల్డ్ దేశవాళీ క్రికెట్ టోర్నీలో, హ్యూస్ సౌత్ ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతూ న్యూ సౌత్ వేల్స్ బౌలర్ షాన్ అబాట్ విసిరిన బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఫిల్‌ను స్ర్టెచర్‌పై అంబులెన్స్‌లోకి తీసుకొచ్చి... ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతనితోనే ఉన్నారు. రెండు రోజుల వరకు ఏదీ చెప్పలేమని సౌత్‌ ఆస్టేలియా క్రికెట్‌ సంఘం (ఎస్‌ఏసీఏ) జీఎం టిమ్‌ నిల్సెన్‌ తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+