Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యూస్ అంతిమ సంస్కారాల్లో కన్నీటిపర్యంతమైన కెప్టెన్ క్లార్క్... పూర్తి నివాళి ప్రకటన చూడండి (వీడియో)

న్యూఢిల్లీ: బౌన్సర్ తగిలి మరణించిన ఆస్టేలియా క్రికెట్ ఫిల్ హ్యూస్ అంత్యక్రియలు అతని స్వస్ధలం మాక్స్‌విల్లేలో ముగిశాయి. హ్యూస్‌ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆసీస్ క్రికెటర్లు, మాజీలు, అభిమానులు తరలివచ్చారు.

సోదరసమానుడైన సహచరుడి అంత్యక్రియలకు హాజరైన ఆసీస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ కన్నీటి పర్యంతమయ్యాడు. హ్యూస్ నివాళికి ప్రకటన చదువుతూ తన కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశాడు. "మై లిటిల్ బ్రదర్... నీ ఆత్మకు శాంతి కలుగుగాక. భౌతికంగా నువ్వు లేకపోయినా, ఇకమీదట నిన్ను ఆటలో చూసుకుంటాం" అని పేర్కొన్నాడు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ndLG-DF1J5o?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

హ్యూస్ అంతిమయాత్ర సందర్భంగా క్లార్క్ 'పాల్ బేరర్' గా వ్యవహరించాడు. నవంబర్ 27న దేశవాళీ క్రికెట్ టోర్నీలో బౌన్సర్ తలకు బలంగా తగలడంతో మరణించిన హ్యూస్ పార్ధీవ శరీరాన్ని ఈరోజు ఉదయం క్రైస్తవ త సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.

కాగా, హ్యూస్ గౌరవార్థం స్వస్థలం మాక్స్‌విల్లేలో అప్రకటిత బంద్ పాటించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేశారు. హ్యూస్ అంత్యక్రియలకు వెళుతున్నామని, దుకాణానికి సెలవు అని స్టోర్ల వెలుపల నోటీసు బోర్డులు పెట్టారు.

Phil Hughes funeral: Michael Clarke's tearful tribute to his 'little brother'

ఇక, హ్యూస్ అంత్యక్రియలను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారీ తెరలపై లైవ్‌గా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఆ దేశ న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇక హ్యూస్ శవపేటికను ఆసీస్ కెప్టెన్ క్లార్క్‌తో పాటు ఆస్టేలియా క్రికెటర్లు మోశారు.

హ్యూస్ అంతిమ సంస్కారాలకు ఆస్టేలియా ప్రధాని టోనీ అబాట్, ప్రస్తుత ఆసీస్ క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు మార్క్ టేలర్, రిచర్డ్ హ్యాడ్లీ, బ్రియాన్ లారా, షేన్ వార్న్, రికీ పాంటింగ్, గిల్ క్రిస్ట్, మెక్ గ్రాత్, బ్రెట్ లీ, మైక్ హస్సీ తదితరులు హాజరయ్యారు. భారత్ తరపున రవిశాస్త్రి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి హాజరయ్యారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+