For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిలిప్ హ్యూస్: కెరీర్‌లో రికార్డు విజయాలు, అవార్డులు

By Nageswara Rao

న్యూఢిల్లీ: దేశీయ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో గాయపడిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ రెండు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు మరణించాడు. అతని మరణం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. ప్రపచం వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, క్రీడాభిమానులు హ్యూస్ మృతికి సంతాపాన్ని తెలిపారు.

మంగళవారం ప్రఖ్యాత మైదానం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సౌత్ ఆస్టేలియా - న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ సీన్ అబ్బాట్ వేసిన బంతి తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే మైదానంలో పడిపోయాడు.

వెంటనే సమీపంలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి... చికిత్స కోసం కృత్రిమ కోమాలోకి తీసుకెళ్లినా రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 25ఏళ్ల వయసున్న ఫిలిప్ హ్యూస్ తన కెరీర్‌లో 26 టెస్టులు ఆడిన హ్యూస్ 32.65 సగటుతో 2866 పరుగులు సాధించాడు.

Phil Hughes' career numbers and achievements

వాటిలో 3 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 25 వన్డేల్లో 1100 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 75.09. వన్డేల్లో 2 సెంచరీలు, 4 ఫిఫ్టీలు నమోదు చేశాడు. ఇక, ఆస్ట్రేలియా ఎ జట్టుకు ఆడుతూ దక్షిణాఫ్రికా ఎ జట్టుపై 202 (నాటౌట్) పరుగులు చేశాడు.

అది వన్డే మ్యాచ్, పైగా హ్యూస్ సాధించింది డబుల్ సెంచరీ ఆస్టేలియా లిస్ట్ ఎ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అదే. ఇప్పటికీ ఆ రికార్డు హ్యూస్ పేరిటే నమోదై ఉంది. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన అతి పిన్న వయస్కుడు హ్యూసే. ఇప్పటికీ ఈ రికార్డు హ్యూస్ హ్యూస్‌పైనే ఉంది.

వడం విశేషం. 2009లో దక్షిణాఫ్రికాపై ఆడడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ప్రవేశించాడు. అప్పటికి ఫిలిప్ హ్యూస్ వయసు 20 ఏళ్లు. భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఫిలిప్ హ్యూస్ కెరీర్ విజయాలు:

* 20 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రంలో 408వ నెంబర్ ఉన్న గ్రీన్ క్యాప్‌ను అందుకున్నాడు.
* 2009లో దక్షిణాఫ్రికాపై డర్బన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (115, 160) చేసిన పిన్న వయసున్న రికార్డు.
* 2009 సంవత్సరానికి గాను బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
* 2013 సంవత్సరానికి గాను డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+