
పీట్ ఫ్రేట్స్ కారణంగా
అయితే, పీట్ ఫ్రేట్స్ కారణంగా 2014లో 'ఐస్ బకెట్ ఛాలెంజ్' సోషల్ మీడియాలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఈ 'ఐస్ బకెట్ ఛాలెంజ్'ని స్వీకరించిన ఎంతో మంది ఒక బకెట్ మంచు-చల్లని నీటిని తమపై పోసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అనంతరం వైద్య పరిశోధనలకు విరాళం ఇవ్వడంతో పాటు వేరొకరికి ఇలా చేయమని సవాల్ విసేరేవారు.

సెలబ్రిటీలు సైతం
టామ్ క్రుయిజ్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, బిల్ గేట్స్, మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ వంటి సెలబ్రిటీలు, హై ఫ్రోఫైల్ పర్సనాలిటీస్ సైతం ఈ ఛాలెంజ్‌ని స్వీకరించడం విశేషం. ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్‌తో ALS(అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్)పై పరిశోధనలు చేసేందుకు గాను సుమారు 200 మిలియన్లు వసూలు చేసింది.

ALS అంటే అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్
ఈ వ్యాధిని అధికారికంగా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అని పిలుస్తారు. నిజానికి ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్‌ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఆంథోనీ సేనేరిచి జూనియర్. ALS) తో బాధపడుతూ 14 ఏళ్ల తర్వాత ఆయన మరణించాడు. మరణించే సమయానికి ఆయన వయసు 46 ఏళ్లు.

ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎలా స్పూర్తినిచ్చింది?
2014లో ఫ్లోరిడా, సారాసోటా నుండి క్రిస్ కెన్నెడీ అనే వ్యక్తి ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి నామినేట్ అయ్యాడు. ఆ సమయంలో అతడికి ALSకు ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తర్వాత అతడు కొంత డబ్బుని విరాళంగా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ALSతో లింక్ చేయబడింది. 2012లో ALSతో బాధపడుతున్న పీట్ ఫ్రేట్స్ బోస్టన్‌లో 200 మంది ప్రజలు తన గౌరవార్థం ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్‌ని స్వీకరించడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ALS వ్యాధి సోకితే ఏం జరుగుతుంది?
ALS అనేది నాడీ కణాలపై ముఖ్యంగా మెదడు, వెన్నుపూసలలో నరాల కణాలను ప్రభావితం చేసే ఒక నరోడెజెనరేటివ్ వ్యాధి. సాధారణంగా 40 నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య నిర్ధారణ చేయబడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి మెదడు కండరాలకు సంకేతాలను పంపడం నిలిపివేస్తుంది. చివరకు మాట్లాడటం, తిని, ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు.


Click it and Unblock the Notifications












