చెన్నై: ప్రపంచంలో కొందరు బౌలర్లు మాత్రమే స్పష్టమైన యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నారని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. చేతి సూటిగా బౌలింగ్ వేయడంతోనే బౌలింగ్ ప్రారంభించానని తెలిపాడు. అయినా 15 డిగ్రీల వంపుతో బౌలింగ్ చేసిన వారికి కూడా బౌలింగ్ అవకాశం ఇవ్వడం అవసరమని తెలిపాడు.
2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచులో లాంగ్ స్లీవ్స్ వేసుకుని బౌలింగ్ చేయడంపై స్పందిస్తూ, అది మంచి పద్ధతి కాదని అశ్విన్ అన్నాడు. 'నిబంధనలు రూపొందించడం నా పని కాదు. ఆడటమే నా పని. ఒకవేళ 15 డిగ్రీల నిబంధన ఉంటే ప్రయోజనం. అందుకే నేను తగ్గడం లేదు. ఆ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నా. అయితే నాకు పిచ్చెక్కిందని కొందరు అనుకుంటున్నారు. కానీ, అది నేరంగా నేను భావించడం లేదు' అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
'పిచ్చి ప్రజలు మాత్రమే జీవితంలో విజయవంతమవుతారని నేను భావిస్తా. మీరు దేనిపైనైనా పిచ్చిని పెచ్చుకుంటే.. మీరు అగ్రస్థానానికి చేరుకుంటారు. గ్రేటర్ డిగ్రీపై పిచ్చి పెంచుకుని టాప్‌లోకి వస్తా. నేను దీని కోసం ప్రయత్నించకపోతే.. నేను నేర్చుకున్నదానికి ఫలితం లేకుండా పోతుంది' అని చెప్పాడు.

కాగా, హర్భజన్ సింగ్ తనకు రోల్ మోడల్ అని అశ్విన్ తెలిపాడు. ఆఫ్ స్పిన్ నేర్పించడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పాడు. తాను ప్రపంచంలోని నిపుణుల మాట వింటానని, ఇయాన్ చాపెల్ లాంటి వారి మాటలు కూడా తనకు ప్రోత్సహాన్ని కలిగించాయని తెలిపాడు.
2001లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ నుంచి తాను ఆఫ్ స్పిన్ వేస్తున్నానని చెప్పాడు. ఎన్నో విజయాలనందించిన హర్భజన్ సింగ్ లాంటి రోల్ మోడల్ టీమిండియాకు అవసరమని అన్నాడు. అతడ్ని చూసే తాను ఆఫ్ స్పిన్‌ను ఇష్టపడ్డట్లు తెలిపాడు.