పీబీఎల్ రసవత్తరం: గుత్తా జ్వాల చేతిలో సింధు ఓటమి
హైదరాబాద్: ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం చెన్నై స్మాషర్స్ మరో ఓటమి చవిచూసింది. ఢిల్లీ ఏసర్స్ జట్టు 5-2తో చెన్నై స్మాషర్స్‌పై విజయం సాధించింది. సింగిల్స్‌లో సత్తా చాటిన సింధు మిక్స్‌డ్ డబుల్స్‌లో రాణించకపోవడంతో చెన్నై అవకాశాలను దెబ్బతీసింది.
పీవీ సింధు సింగిల్స్ ట్రంప్ మ్యాచ్‌లో గెలిచినా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నిరాశే ఎదురైంది. ఢిల్లీ ఏసర్స్ జోర్గెన్‌సన్‌తో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో సుగియార్తో 12-10, 4-11, 6-11తో ఓటమిపాలయ్యాడు. దీంతో 1-0 ఆధిక్యం సంపాదించింది. తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ అభిమానులకు కనువిందు చేసింది.

అలరించిన గుత్తా జ్వాల, పీవీ సింధు పోరు
ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు గుత్తా జ్వాల, పీవీ సింధు తలపడి అలరించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు తరఫున ఆడిన గుత్తా జ్వాల, ఇవనోవ్ జంట, చెన్నై స్మాషర్స్ తరఫున ఆడిన పీవీ సింధు, క్రిస్ అడ్ కాక్ జోడీపై విజయం సాధించింది.

తొలి సెట్‌ను కైవసం చేసుకున్న సింధు జోడి
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 7-11 తేడాతో సింధు జోడి కైవసం చేసుకున్నప్పటికీ, ఆపై రెండు సెట్లనూ 11-4, 11-9 తేడాతో జ్వాల, ఇవనోవ్ జోడి గెలిచింది. ఈ గెలుపుతో పాటు మరో రెండు మ్యాచ్‌లలో సైతం ఢిల్లీ నెగ్గడంతో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

సన్ వాన్ హొ చేతిలో ఓటమిపాలైన కశ్యప్
ఆ తర్వాత కశ్యప్ 10-12, 4-11తో సన్ వాన్ హొ (ఢిల్లీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఢిల్లీ ఆధిక్యం 3-0కు పెరిగింది. ఇక ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల డబుల్స్‌లోనూ ఢిల్లీ ఏసర్స్ జోరు ప్రదర్శించి విజయాన్ని ఖాయం చేసుకుంది. వ్లాదిమిర్ ఇవనోవ్-ఇవాన్ సొజొనోవ్ జోడీ 11-6, 11-6తో స్మాషర్స్ ద్వయం అడ్‌కాక్-కోల్డింగ్‌పై అలవోకగా నెగ్గింది.

తన్వీ లాడ్‌పై సింధు విజయం
దీంతో ఢిల్లీ 5-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ (చెన్నైకి ట్రంప్)లో సింధు 11-6, 11-7తో తన్వీ లాడ్‌పై విజయం సాధించింది. తన్వీ లాడ్‌తో మ్యాచ్‌లో సింధు 11-6, 11-7తో సునాయాస విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications