తప్పుకున్న సైనా: అవధ్‌కు చెన్నై షాక్, సింధు గెలుపు
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో చెన్నై స్మాషర్స్ గెలుపు జోరు కొనసాగిస్తోంది. బుధవారం చెన్నై స్మాషర్స్ జట్టు 4-3తో అవధె వారియర్స్‌పై విజయం సాధించింది. దీంతో స్మాషర్స్ 17 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. దీంతో నాకౌట్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న అవధ్ వారియర్స్ 21, ముంబై రాకెట్స్ 19, చెన్నై స్మాషర్స్ 18 పాయింట్లతో టాప్ 3 స్ధానాల్లో నిలిచాయి.
గురువారం జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ ఢిల్లీ ఏసర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ (9) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే సెమీస్‌కు చేరుతుంది. అదే ఐదు పాయింట్ల తేడాతో విజయం సాధిస్తే ఢిల్లీ ఏసర్స్ ఛాన్స్ ఉంటుంది. బుధవారం తొలి పురుషుల సింగిల్స్‌లో వాంగ్ వింగ్ 6-11, 11-9, 12-10తో సెన్‌సోమ్‌బున్సాక్ (చెన్నై)పై గెలవడంతో అవధ్ 1-0తో శుభారంభం చేసింది.

1-1తో స్కోరు సమం
ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్‌కాక్-గాబ్రియెల్ అడ్‌కాక్ జోడీ 11-4, 11-9తో వరుస గేముల్లో బోడిన్ ఇసారా-ప్రజక్తా సావంత (అవధ్) జోడీ నెగ్గడంతో చెన్నై 1-1తో స్కోరుని సమం చేసింది.

సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ విజయం
ఇక చెన్నై ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 11-7, 5-11, 11-7తో ఆదిత్య జోషిపై గెలవడంతో స్మాషర్స్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

తప్పుకున్న సైనా నెహ్వాల్
ఇక మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు 11-4, 11-6తో రితూపర్ణ దాస్‌పై నెగ్గడంతో చెన్నై స్కోరు 4-1కి పెరిగింది. ఈ మ్యాచ్‌లో అవధ్ తరఫున సైనా నెహ్వాల్ పోటీపడాల్సి ఉన్నా చివరి నిమిషంలో ఆమె తప్పుకుంది.

ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైన అవధ్ వారియర్స్
ఇక అవధ్ వారియర్స్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల డబుల్స్‌లో గో వీ షెమ్-మార్కిస్ కిడో 12-10, 11-8తో సుమీత్-కోల్డింగ్‌పై గెలిచినా అవధ్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications