పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో తొలి రోజు భారత్‌కు శుభారంభం దక్కింది. యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. అంతేగాక అరుదైన రికార్డు సాధించింది. మరోవైపు భారత పారా షట్లర్లు సత్తాచాటారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లో మనోళ్లు పైచేయి సాధించారు.
పారాలింపిక్స్ ఆర్చరీలో భారత్‌కు తొలి స్వర్ణం అందించాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన శీతల్ దేవి అంచనాలకు తగ్గట్లుగా శుభారంభం చేసింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్స్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. 720కి గాను 703 పాయింట్లు సాధించి నేరుగా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో శీతల్ దేవి అరుదైన రికార్డు నెలకొల్పింది. 700+ పాయింట్లు సాధించిన భారత తొలి మహిళ ఆర్చర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

కాగా, ఇదే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు ఒక్క పాయింటు తేడాతో ప్రపంచ రికార్డు మిస్ అయ్యింది. తుర్కియేకు చెందిన ఒజ్నుర్ గిర్డి (704) ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది. మరో భారత ఆర్చర్ సరిత 682 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ రౌండ్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆర్చర్లు నేరుగా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు. కాగా, శనివారం ప్రిక్వార్టర్స్‌లో చిలీ ఆర్చర్ జునిగా లేదా కొరియా ప్లేయర్ చోయ్ నా మితో శీతల్ తలపడే అవకాశం ఉంది. ఆర్చరీ విభాగంలో మనకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పసిడి దక్కలేదు.
ఇక పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో హర్విందర్ సింగ్ (637) తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో మొదట రోజు భారత్ సత్తాచాటింది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో గ్రూప్- బీలో మలేసియా ప్లేయర్ అమిన్‌పై సుకాంత్ 17-21, 21-15, 22-20 తేడాతో; గ్రూప్-డీలో బ్రెజిల్ షట్లర్ జేవియర్‌పై తరుణ్ 21-17, 21-19తో; గ్రూప్-ఏలో ఇండోనేషియా క్రీడాకారుడు హిక్మత్‌పై సుహాస్ 21-7, 21-5తో విజయం సాధించాడు.
ఇక ఎస్‌ఎల్3 సింగిల్స్ గ్రూప్-ఏలో సహచర షట్లర్ మనోజ్ సర్కార్‌పై నితేశ్ కుమార్ గెలిచాడు. ఎస్‌హెచ్6 గ్రూప్-ఏలో శివరాజన్.. సుభాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటిమిపాలయ్యాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఎస్‌యూ5 గ్రూప్-ఏలో తులసిమతి; గ్రూప్-బీలో మనీష , ఎస్‌ఎల్4 గ్రూప్-సిలో పలక్ కోహ్లి; ఎస్‌హెచ్6 గ్రూప్-ఏలో నిత్యశ్రీ విజయం సాధించారు.