Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో సోమవారం భారత్ పతకాల మోత మోగించింది. రెండు స్వర్ణాలతో ఏకంగా ఏడు పతకాలు సాధించింది. గత మూడు రోజుల్లో ఏడు పతకాలు సాధించిన మన అథ్లెట్లు నిన్న ఒక్క రోజే ఏడు పతకాలతో అదరగొట్టడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ పసిడి గెలిచాడు. నితేశ్‌కు ఇదే తొలి పారాలింపిక్స్. బ్రిటన్ షట్లర్ డేనియల్ బెథెల్‌పై నితేశ్ 21-14, 18-21, 23-21తో పైచేయి సాధించాడు.
ఇక పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 64 కేటగిరీలో సుమిత్ అంటిల్ తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. జావెలిన్‌ను 70.59 మీటర్ల విసిరి ఈ డిఫెండింగ్ ఛాంపియన్ స్వర్ణం ఖరారు చేసుకున్నాడు. ఈ క్రమంలో సుమిత్ అరుదైన ఘనత సాధించాడు. దేవేంద్ర ఝఝారియా, అవని లేఖర తర్వాత పారాలింపిక్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు.

ఇక భారత్ సోమవారం మూడు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఎస్‌ఎల్4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్ రజత పతకం అందుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఈ ఐఏఎస్ అధికారి రజతమే సాధించాడు. మహిళల సింగిల్స్ ఎస్‌యు5 విభాగంలో తులసిమతి మురుగేశన్ సిల్వర్ గెలిచింది. ఇదే విభాగంలో మనీషా రామ్‌దాస్ కాంస్యం నెగ్గింది. వీరిద్దరూ తమిళనాడుక చెందిన క్రీడాకారుణులే.
డిస్కస్‌త్రోలో యోగేశ్ కతూనియా రజతం సాధించాడు. ఎఫ్-56 విభాగంలో 42.22 మీటర్ల దూరం డిస్కస్‌ను యోగేశ్ విసిరాడు. గత పారాలింపిక్స్‌లోనూ యోగేశ్ సిల్వర్ అందుకున్నాడు. పారా ఆర్చరీ శీతల దేవీ రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్సడ్ డబుల్స్‌లో కాంస్యం సాధించింది. కాగా, పతకాల పాయింట్ల పట్టికలో భారత్ మూడు గోల్డ్, అయిదు సిల్వర్, ఏడు కాంస్యాలతో 15 స్థానంలో ఉంది. చైనా (87) అగ్రస్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications