Paris Paralympics 2024: భారత్ సంచలనం.. షూటింగ్‌లో స్వర్ణం, కాంస్యం
పారాలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతాను ఘనంగా తెరిచింది. శుక్రవారం జరిగిన షూటింగ్‌లో ఏకంగా రెండు పతకాలతో సత్తాచాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. టోక్యో పారిలింపిక్స్‌లోనూ అవని గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే.
ఇక మోనా అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. భారత్ ఖాతాను మోనానే ఆరంభించింది. మెనా కంచు మోత మోగించిన కాసేపటికీ అవని బంగారు పతకంతో మెరిసింది. కాగా, అవని 11 ఏళ్ల వయస్సులో కారు ప్రమాదంతో పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి వీల్ చైర్‌కే పరిమితమైంది. కానీ షూటింగ్‌లో సత్తాచాటుతూ టోక్యోలో భారత్‌కు గోల్డ్ అందించింది. అదే జోరును పారిస్ పారాలింపిక్స్‌లోనూ కొనసాగించింది.

పసిడి పతకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, 249.7 పాయింట్లతో తన రికార్డును మెరుగుపర్చుకుంది. టోక్యో అవని 249.6 పాయింట్లు సాధించింది. మరోవైపు మోనాకు ఇది తొలి పారాలింపిక్స్. తాను పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లోనే మోనా కంచు మోత మోగించి భారత షూటింగ్‌లో భవిష్యత్ తారగా సత్తాచాటింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications