Paris Paralympics 2024: సచిన్‌కు రజతం.. భారత్ 21
పారిస్ వేదికగా జరగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. బుధవారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో సచిన్ సర్జేరావు ఖిలారీ రజతం సాధించాడు. సచిన్ 16.32 మీటర్లు షాట్ పుట్‌ను విసిరి రెండో స్థానంలో నిలిచి పతకాన్ని సాధించాడు. కెనడా క్రీడాకారుడు గ్రెగ్ స్టీవర్ట్ 16.38 మీటర్లు విసిరి పసిడి గెలుచుకున్నాడు.
దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ జాబితాలో 21 పతకాలు చేరాయి. భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, 10 కాంస్య పతకాలు సాధించారు. ఇక పతకాల పట్టిక జాబితాలో భారత్ ప్రస్తుతం 19వ స్థానానికి చేరింది. కాగా, ఎఫ్ 46 షాట్‌పుట్ విభాగంలో పాల్గొన్న ఇతర భారత క్రీడాకారులు మహ్మద్ యాసర్, రోహిత్ కుమార్ వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. యాసర్ 14.21 మీటర్లు, రోహిత్ 14.10 మీటర్లు విసిరారు.

కాగా, సచిన్ సర్జేరావు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని కరగాని గ్రామానికి చెందినవాడు. పాఠశాలలో జరిగిన ప్రమాదంలో తన ఎడమచేతికి బలమైన గాయం తగిలి వైకల్యంగా మారింది. 2015లో పారా క్రీడల్లో అడుగుపెట్టిన సచిన్.. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. 2022లో ఏషియన్ పారా గేమ్స్‌లో, 2023, 2024లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పసడి సాధించాడు.
Silver Stunner! 🥈🇮🇳
— JioCinema (@JioCinema) September 4, 2024
Sachin Khilari smashes the Asian record with a phenomenal 16.32m throw in Men’s Shot Put F46 at #ParalympicGamesParis2024! 🔥 Keep watching the live action on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #Paris2024 #ShotPut #Paralympics pic.twitter.com/N8BSPkkXZN
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications