Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Paralympics 2024: థ్యాంక్యూ భారత్.. రికార్డు స్థాయిలో పతకాలు

పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శనతో అంచనాలకు మించి పతకాలు సాధించారు. వైకల్యాన్ని దాటి పతక వేట కొనసాగించారు. 25 పతకాల లక్ష్యంగా బరిలోకి దిగి 29 పతకాలతో మువ్వెన్నెల జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించారు. దేశం గర్వించేలా ప్రదర్శన చేశారు. థ్యాంక్యూ భారత పారా అథ్లెట్స్.

పతక లక్ష్యంగా 84 మంది బయలుదేరి 29 మెడల్స్ సాధించడమంటే సాధారణ విషయం కాదు. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో 18వ స్థానంలో దేశాన్ని సగర్వంగా నిలబెట్టారు. గత టోక్నో పారాలింపిక్స్‌ 19 పతకాలను ఆదిలోనే అధిగమించి అదరగొట్టారు.

Paris Paralympics 2024 India s Medal Tally and Complete List of Winners

1968 నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పోటీపడగా.. 2016 పారాలింపిక్స్ వరకు మన క్రీడాకారులు 12 పతకాలే సాధించారు. కానీ ఆ తర్వాత కథ మారింది. గత రెండు పారాలింపిక్స్‌లో ఏకంగా 48 పతకాలు సాధించారు. 12 స్వర్ణాలు, 17 రజతాలు, 19 సార్లు కంచు మోత మోగించారు. కాగా, ఈ పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈ విశ్వక్రీడల్లో మన పతక విజేతల పూర్తి జాబితా ఇదే

పతకాలు సాధించిన అథ్లెట్లు
అవని లేఖరా - స్వర్ణం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1
మోనా అగర్వాల్ - కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1
ప్రీతి పాల్ - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 100మీ T35
మనీశ్‌ నర్వాల్ - రజతం (షూటింగ్) పురుషుల ఎయిర్‌ పిస్టల్ SH1
రుబీనా ఫ్రాన్సిస్‌ - కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్ SH1
ప్రీతి పాల్ - కాంస్యం (అథ్లెటిక్స్‌) మహిళల 200మీ T35

నిషాద్ కుమార్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T47
యోగేశ్ కతునియా - రజతం (అథ్లెటిక్స్‌) పురుషుల డిస్కస్ త్రో F56
నితేష్ కుమార్ - స్వర్ణం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL3
తులసిమతి మురుగేశన్ - రజతం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5
మనీశా రామదాస్ - కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5
సుహాస్ యతిరాజ్ - రజతం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL4

రాకేశ్‌ కుమార్/శీతల్ దేవి - కాంస్యం (ఆర్చరీ) ఆర మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్
సుమిత్‌ అంటిల్‌ - స్వర్ణం (అథ్లెటిక్స్) జావెలిన్ త్రో ఎఫ్64
నిత్య శ్రీ శివన్ - కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SH6
దీప్తి జీవాంజి - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 400 మీటర్ల టీ20
శరద్ కుమార్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 (అథ్లెటిక్స్)
మరియప్పన్ తంగవేలు - కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63

అర్జీత్‌ సింగ్‌ - రజతం (అథ్లెటిక్స్‌) పురుషుల జావెలిన్ త్రో F46
గుర్జర్‌ సుందర్‌ సింగ్‌ - కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F46
సచిన్‌ ఖిలారీ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46
హర్విందర్ సింగ్ - స్వర్ణం (ఆర్చరీ) పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్
ధరంబీర్ సింగ్ - స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51
ప్రణవ్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51

కపిల్ పర్మార్ - కాంస్యం (జూడో) పురుషుల -60 కేజీల జే1
ప్రవీణ్ కుమార్ - స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T64
హొకాటో హొటోజి సెమా - కాంస్యం (అథ్లెటిక్స్‌) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57
సిమ్రాన్ - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 200 మీటర్ల టీ12
నవదీప్ సింగ్ - స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F41.

Story first published: Sunday, September 8, 2024, 18:39 [IST]
Other articles published on Sep 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+