Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Paralympics 2024: నేటి భారత షెడ్యూల్ ఇదే.!

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌కు పతకాలతో హోరెత్తించింది. స్వర్ణంతో సహా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో అవని లేఖర స్వర్ణం, మోనా అగర్వాల్ కాంస్యం పతకాలు అందుకున్నారు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనీశ్‌ నర్వాల్‌ రజతం సాధించాడు. మహిళల టీ-35 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్‌ కాంస్యం గెలిచింది.

అయితే బ్యాడ్మింటన్‌లో మాత్రం భారత్‌కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. సుహాస్‌ యతిరాజ్, నితీశ్‌ కుమార్‌ సెమీఫైనల్స్ చేరుకున్నారు. మానసి జోషి, మనోజ్‌ సర్కార్‌ పారాలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. అలాగే నారాయణ జోడీకి నిరాశే మిగిలింది. తెలుగు పారా అథ్లెట్‌ నారాయణ కొంగనపల్లె-అనిత జోడీ..రోయింగ్ మిక్స్‌డ్‌ పీఆర్‌3 డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్లో ఫైనల్‌ చేరలేకపోయింది.

Paris Paralympics 2024 India s Day 3 Full Schedule Events Athletes and IST Timings

టేబుల్‌ టెన్నిస్‌లో భవీనాబెన్‌ పటేల్, సోనాల్‌బెన్‌ పటేల్‌ మహిళల డబుల్స్‌ డబ్ల్యూడీ-10 విభాగంలో పతక రౌండుకు అర్హత సాధించలేకపోయారు.అయితే ఇవాళ పతకాల జోరును కొనసాగించడానికి మన క్రీడాకారులు సిద్ధమయ్యారు. నేటి భారత షెడ్యూల్ వివరాలు..

షూటింగ్‌: పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (స్వరూప్‌)- మధ్యాహ్నం 1, ఫైనల్‌- మధ్యాహ్నం 3.45 గంటలకు;
షూటింగ్‌: మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (రుబీనా)- మధ్యాహ్నం 3.30, ఫైనల్‌- సాయంత్రం 6.15 గంటలకు
సైక్లింగ్‌: మహిళల సీ1-3 500మీ.టైమ్‌ ట్రయల్‌ క్వాలిఫయింగ్‌ (జ్యోతి)- మధ్యాహ్నం 1.30, ఫైనల్‌- సాయంత్రం 5.05 గంటలకు;
సైక్లింగ్‌: పురుషుల సీ1-3 1000మీ.టైమ్‌ ట్రయల్‌ క్వాలిఫయింగ్‌ (షేక్‌ అర్షద్‌)- మధ్యాహ్నం 1.49, ఫైనల్‌- సాయంత్రం 5.32 గంటలకు

ఆర్చరీ: మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌ (సరిత × ఎలెనోరా)- రాత్రి 7 గంటలకు
ఆర్చరీ: మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌ (శీతల్‌ × మారియానా)- రాత్రి 8.59 గంటలకు, పతక రౌండ్లు- రాత్రి 11.13 నుంచి
అథ్లెటిక్స్‌: పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌ (పర్వీన్‌ కుమార్‌)- రాత్రి 10.30 గంటలకు.

Story first published: Saturday, August 31, 2024, 9:29 [IST]
Other articles published on Aug 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+