Paris Paralympics 2024: నేటి భారత షెడ్యూల్ ఇదే!
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో తొలి రోజు భారత్‌కు శుభారంభం దక్కింది. యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్స్ రౌండ్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచింది. 703 పాయింట్లు సాధించిన ఆమె.. 700+ పాయింట్లు సాధించిన భారత తొలి మహిళ ఆర్చర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.
ఒక్క పాయింటు తేడాతో ప్రపంచ రికార్డు మిస్ అయ్యింది. తుర్కియేకు చెందిన ఒజ్నుర్ గిర్డి (704) ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తొలి రోజు భారత పారా షట్లర్లు సత్తాచాటారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లో మనోళ్లు పైచేయి సాధించారు. కాగా, అదే జోరును ఇవాళ కూడా కొనసాగించాలని భారత క్రీడాకారులు పట్టుదలతో ఉన్నారు. నేటి భారత షెడ్యూల్ వివరాలు..

షూటింగ్: మహిళల 10మీ.ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (అవని లేఖరా, మోనా అగర్వాల్)- మధ్యాహ్నం 12.30, ఫైనల్- మధ్యాహ్నం 3.15 గంటలకు
షూటింగ్: పురుషుల 10మీ.ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (రుద్రాన్ష్, మనీశ్)- మధ్యాహ్నం 2.45, ఫైనల్- సాయంత్రం 5.30 గంటలకు;
షూటింగ్: పురుషుల మిక్స్‌డ్ 10మీ.ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్2 క్వాలిఫికేషన్ (శ్రీహర్ష)- సాయంత్రం 5, ఫైనల్- రాత్రి 7.45 గంటలకు
అథ్లెటిక్స్: మహిళల డిస్కస్ త్రో ఎఫ్55 ఫైనల్ (జ్యోతి, సాక్షి)- మధ్యాహ్నం 1.30 గంటలకు
అథ్లెటిక్స్: మహిళల 100మీ.పరుగు టీ35 ఫైనల్ (ప్రీతి)- సాయంత్రం 4.45 గంటలకు
అథ్లెటిక్స్: పురుషుల షాట్‌పుట్ ఎఫ్37 ఫైనల్ (మను)- రాత్రి 12.22 గంటలకు
బ్యాడ్మింటన్: ఉమెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3 మనసి జోషీ Vs ఒక్సనా (మధ్యాహ్నం 12.30)
బ్యాడ్మింటన్: మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3 మనోజ్ Vs బున్సన్ (మధ్యాహ్నం 1.20)
బ్యాడ్మింటన్: మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3 నితీశ్ Vs యంగ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
బ్యాడ్మింటన్: మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్4 సుహాస్ Vs షిన్ క్యుంగ్ (మధ్యాహ్నం 2.40)
బ్యాడ్మింటన్: ఉమెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్4 పాలక్ కోహ్లి Vs లీన్ (మధ్యాహ్నం 4.40)
బ్యాడ్మింటన్: ఉమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ5 తులసిమతి Vs మొంటైరో (రాత్రి 7.30)
బ్యాడ్మింటన్: మిక్సడ్ డబుల్స్ ఎస్‌హెచ్6 శివరాజన్-నిత్య Vs మీచయ్-చయ్ (రాత్రి 1.30).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications