Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ స్థానం ఏంటి? ఫ్రీగా చూడాలంటే?

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. రేపే ఈ మహా సంబరం జరగనుంది. చరిత్రలో నిలిచేలా ఈ వేడుకుల ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. తొలిసారిగా స్టేడియంలో కాకుండా ఆరుబయట నదిలో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో క్రీడాప్రేమికులకు కలిగే కొన్ని సందేహాలకు 'మైఖేల్' సమాధానం ఇస్తుంది.

ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు ఎక్కడ జరగనున్నాయి? ఏ సమయానికి ప్రారంభం కానున్నాయి? పరేడ్‌లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఏ ప్రాతిపదికన స్థానాన్ని ఖరారు చేశారు? మొబైల్స్‌లో, టీవీల్లో లైవ్ చూడాలంటే ఎలా? ఇలా అన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లభించనుంది.

Paris Olympics Opening Ceremony When Will India Appear in the Parade of Nations

ఈ ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇస్తుంది. గతంలో ఫ్రాన్స్ 1900, 1924లో కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు వందేళ్ల తర్వాత మరోసారి విశ్వక్రీడలకు ఫ్రాన్స్ వేదికగా నిలుస్తుంది. ఆరంభోత్సవ వేడుకలు జులై 26వ తేదీన జరగనున్నాయి. అయితే ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ కాస్త భిన్నంగా ఉంటుంది. పారిస్‌లో ప్రవహించే సెన్‌ నదిపై నిర్వహించనున్నారు.

స్పోర్ట్స్18 నెట్‌వర్క్, ఓటీమీ ప్లాట్‌ఫారమ్ జియోసినిమాలో పారిస్ ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. భారత సమయం పారిస్ కంటే 3.30 గంటలు ముందుంటుంది. మన టైమింగ్స్‌లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు ఉదయం 11 గంటలకు మొదలవుతాయి. అథ్లెట్ల పరేడ్ పడవల్లో ఉంటుంది. ఈ రివర్ పరేడ్‌లో దాదాపు 94 పడవల్లో క్రీడాకారులు పయనిస్తారు.

దేశాల తరఫున క్రీడాకారులు పరేడ్‌లో ప్రాతినిథ్యం వహించడం 1908 లండన్ గేమ్స్‌లో మొదలైంది. ఇక రేపటి ఓపెనింగ్ సెర్మనీ పరేడ్‌లో గ్రీస్ దేశం ముందుంటుంది. ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్‌కు గౌరవార్థంగా ఆ దేశాన్ని ఖవాతులో ముందు ఉంచుతారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీమ్ ఉంటుంది.

ఓపెనింగ్ సెర్మనీ పరేడ్‌లో దేశాల స్థానాన్ని ఖరారు చేసుకోవడానికి ఆల్ఫాబెట్ వరుస క్రమాన్ని అనుసరిస్తారు. అయితే ఆతిథ్య దేశ జాతీయ బాషను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక ఆతిథ్య దేశం పరేడ్‌లో ఆఖరి స్థానంలో ఉంటుంది. అంతకంటే ముందు వరుసగా వచ్చే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఉంటాయి. అంటే 203 స్థానంలో ఆస్ట్రేలియా (2032 ఒలింపిక్స్), 204 స్థానంలో అమెరికా (2028 ఒలింపిక్స్), 205 స్థానంలో ఫ్రాన్స్ (2024 ఒలింపిక్స్) ఉంటాయి.

ఇక భారత్ 84వ స్థానంలో వస్తుంది. ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్‌తో పాటు సింధు మువ్వెన్నల జెండాను పట్టుకొని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించనుంది.

Story first published: Thursday, July 25, 2024, 20:08 [IST]
Other articles published on Jul 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+