Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: స్మగ్లింగ్ కు పాల్పడ్డ భారత అథ్లెట్ సోదరి..!

పారిస్ ఒలింపిక్స్ పలు వివాదాలకు వేదికగా మారింది. తాజాగా భారత అథ్లెట్ సోదరి స్మిగ్లింగ్ పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం యాంటిమ్, ఆమె సోదరిని పోలీస్ స్టేషన్‌ లో విచారించారు. భారీ భద్రత ఉన్న గ్రామంలోకి ఆమె సోదరిని 'స్మగ్లింగ్' చేసేందుకు ప్రయత్నించారని, ఇది కఠినమైన ఒలింపిక్ ప్రోటోకాల్‌లను స్పష్టంగా ఉల్లంఘించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

53 కేజీల విభాగంలో ఘోర పరాజయాన్ని చవిచూసిన యాంటిమ్, ఆమె సోదరి మరియు కోచ్‌లతో కలిసి తిరిగి తమ హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) నుంచి అధికారిక ప్రకటన ప్రకారం, క్రమశిక్షణా ఉల్లంఘన తర్వాత యాంటిమ్, ఆమె సహాయక సిబ్బందిని భారతదేశానికి తిరిగి పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘనను ఫ్రెంచ్ అధికారులు IOA దృష్టికి తీసుకురావడంతో రెజ్లర్ యాంటిమ్ ఆమె సహాయక సిబ్బందిని వెనక్కి పంపాలని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయించింది.

Paris Olympics Indian athlete Antim s sister has been accused of smuggling

యాంటిమ్ కోచ్‌లు భగత్ సింగ్, వికాస్ కూడా పారిస్ పోలీసు విచారించినట్లు తెలుస్తోంది. వారు స్టేడియం నుంచి తమ హోటల్‌కు క్యాబ్‌ను తీసుకున్న తర్వాత, వారు డ్రైవర్‌కు డబ్బు చెల్లించడానికి నిరాకరించారని తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిని విచారించారు. 53 కేజీల విభాగంలో ఆంటిమ్ ఒలింపిక్ అరంగేట్రం ఇప్పటికే అట్టహాసంగా ప్రారంభమైంది. టర్కీకి చెందిన జైనెప్ యెట్‌గిల్‌తో తలపడిన ఆమె ఏకపక్ష మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆమె పతక ఆశలు ఆవిరయ్యాయి.

19 ఏళ్ల రెజ్లర్, భారతదేశానికి ఆశాజనకమైన అవకాశంగా భావించారు. ఆమె తన సోదరితో సన్నిహితంగా ఉండాలనే కోరికతో, విలేజ్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లను విజయవంతంగా దాటిన తర్వాత యాంటిమ్ తన అక్రిడిటేషన్ కార్డును ఆమె తోబుట్టువుకు పంపినట్లు తెలిసింది. ఆమె సోదరి కార్డును ఉపయోగించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమెను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఇది కూడా వివాదంగా మారింది. బుధవారం అర్థరాత్రి, అక్కాచెల్లెళ్లిద్దరినీ గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఫ్రాన్సు నుంచి వెంటనే బయలుదేరేందుకు ఏర్పాట్లు చేయాలని భారత జట్టు అధికారులకు పోలీసులు సూచించినట్లు సమాచారం.

Story first published: Thursday, August 8, 2024, 10:11 [IST]
Other articles published on Aug 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+