Paris Olympics 2024: భారత్‌కు మూడో పతకం.. బుల్లెట్ మరోసారి దిగింది!
పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ మూడో పతకం సాధించింది. పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె కాంస్యం సాధించాడు. ఈ క్రమంలో స్వప్నల్ చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.
ఫైనల్‌లో స్వప్నిల్ 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే మోకాళ్లపై కూర్చుని 153.3 పాయింట్లు సాధించిన సమయానికి స్వప్నిల్ ఆరో స్థానంలో ఉన్నాడు. బోర్లా పడుకునే తూటా పేల్చే టైమ్‌కు 310.1 పాయింట్లతో అయిదో స్థానానికి ఎగబాకాడు. అయితే నిలబడి షూట్ చేసే సమయానికి స్వల్ప పాయింట్ల తేడాతో స్వప్నిల్ క్రమంగా ముందుకు సాగాడు. అంతిమంగా పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన స్పప్నిల్‌కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్.

చైనాకు చెందిన లియు యుకున్ స్వర్ణం సాధించాడు. అతను 463.6 పాయింట్లు కొల్లగొట్టాడు. రజతం సాధించిన కులిష్ (ఉక్రెయిన్) 461.3 పాయింట్లు సాధించాడు. కాగా, ఈ విశ్వక్రీడల్లో ఇప్పటివరకు భారత్ సాధించిన అన్ని పతకాలు షూటింగ్‌లోనే కావడం విశేషం. అంతేగాక అన్నీ కాంస్యాలే. షూటర్ మను బాకర్ రెండు కాంస్యాలు గెలిచిన సంగతి తెలిసిందే. మొదట మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్‌లో కాంస్యం నెగ్గిన మను.. సరబ్‌జ్యోత్‌తో కలిసి మిక్స్‌డ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కంచు మోగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications