Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics: మనుపై మరోసారి ఆశలు.. రేపటి భారత్ షెడ్యూల్ ఇదే!

పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం భారత్‌ సత్తాచాటింది. మెరుగైన ఫలితాలు అందుకుంది. ఈ విశ్వక్రీడల్లో భారత్‌ ఖాతాను తెరిచిన షూటర్, రెండు కాంస్య పతకాల విజేత మను బాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు పతక పోరు ప్రారంభం కానుంది.

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాను 3-2తో చిత్తుచేసింది. ఒలింపిక్స్‌‌లో ఆస్ట్రేలియాపై 52 ఏళ్లలో భారత్‌‌కు ఇదే తొలి విజయం. ఇక ఇవాళ భారత ఆర్చర్లు కూడా సత్తా చాటారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌ ద్వయం అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కు చేరింది. కాగా, గోల్ఫ్, షూటింగ్, ఆర్చరీ, సైలింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్ ఈవెంట్‌లో భారత్ పోటీపడనుంది. క్వార్టర్స్‌లో బాక్సర్ నిశాంత్ మెక్సికో ప్లేయర్‌తో తలపడనున్నాడు.

paris

ఆగష్టు 3న భారత్ షెడ్యూల్
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత విభాగంలో స్ట్రోక్‌ప్లే రౌండ్-3 (శుభాంకర్ శర్మ, గగనజీత్)- మధ్యాహ్నం 12.30
షూటింగ్: ఉమెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ డే1- (రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహన్)- మధ్యాహ్నం 12.30
షూటింగ్: మెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ డే2 (అనంత్‌జీత్ సింగ్)- మధ్యాహ్నం 12.30
షూటింగ్: ఉమెన్స్ 25మీ. పిస్టల్ ఫైనల్ (మను బాకర్)- మధ్యాహ్నం 1 గంట

ఆర్చరీ: ఉమెన్స్ 1/8 ఎలిమినేషన్స్ (భజన్ కౌర్ వర్సెస్ మిచెల్ క్రొప్పెన్ (జర్మనీ), (దీపికా కుమారి వర్సెస్ డయనా (ఇండోనేషియా)) మధ్యాహ్నం 1.52
సైలింగ్: మెన్స్ రేస్ 5 & 6 (విష్ణు శరవణన్) మధ్యాహ్నం 3.45
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగంలో పతక రౌండ్లు- సాయంత్రం 5.09

సైలింగ్: ఉమెన్స్ రేస్ 5 & 6 (నేత్రా)- రాత్రి 7.05
అథ్లెటిక్స్: షాట్ పుట్ (తజేంద్రపాల్)- రాత్రి 11.05
బాక్సింగ్: మెన్స్ 71 కేజీ క్వార్టర్ ఫైనల్స్- రాత్రి 12.18 (నిశాంత్ వర్సెస్ మార్కో అలన్సో (మెక్సికో)) .

Story first published: Friday, August 2, 2024, 19:47 [IST]
Other articles published on Aug 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+