For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు షాక్.. టోక్యో ఒలింపిక్ పతక విజేతకు గాయం

పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో తొమ్మిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో మించి మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు పారిస్‌కు సిద్ధమయ్యారు.

అయితే ఈ కీలక సమయంలో భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గొహెయిన్‌కు గాయంతో బాధపడుతోంది. ప్రస్తుతం జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లో శిక్షణ శిబిరంలో ఉన్న లవ్లీనా వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతోంది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI)కి చెందని ఉన్నతాధికారి Mykhelతో ఈ విషయాన్ని ధృవీకరించారు.

Paris Olympics 2024 Lovlina Borgohain Deals With Back Pain at Germany Camp Just Days Before Games

ఇటీవల చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరిగిన గ్రాండ్‌ ప్రిక్స్‌ బాక్సింగ్‌ టోర్నీలో లవ్లీనా రజతం సాధించి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. స్వర్ణం లక్ష్యంగా పారిస్ విశ్వక్రీడల్లో 75 కేజీల విభాగంలో ఆమె హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ కీలక సమయంలో ఆమెకు వెన్నునొప్పి రావడం భారత్‌ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే నడుము నొప్పితో బాధపడుతున్నప్పటికీ 26 ఏళ్ల లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా సంచల ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్ పతకం సాధించిన మూడో భారత బాక్సర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అసోంకు చెందిన ఈ అమ్మాయి ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె ఈసారి 75 కేజీల విభాగానికి మారింది. కాగా, లవ్లీనాతో పాటు తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, జైస్మిన్ లాంబోరియా, ప్రీతి పన్వర్, అమిత్ ఫంగాల్ కూడా ఫేవరేటుగా పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారు.

నిఖత్ జరీన్‌ 50 కేజీల విభాగంలో, జైస్వీన్ లాంబోరియా 57 కేజీలు, ప్రీతి పన్వర్ 54 కేజీలు విభాగంలో పోటీపడుతున్నారు. ఇక పురుషుల విభాగంలో 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, 71 కేజీల విభాగంలో నిశాంత్ దేవ్‌ బరిలోకి దిగుతున్నారు.

Story first published: Wednesday, July 17, 2024, 22:11 [IST]
Other articles published on Jul 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+