Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సత్తాచాటాడు. పురుషుల సింగిల్స్‌‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్‌లో చైనీస్‌ తైపీ ఆటగాడు చౌ తియెన్‌ చెన్‌‌ను 19-21, 21-15, 21-12‌తో ఓడించాడు. ఈ క్రమంలో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. విశ్వక్రీడల్లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మెన్స్ షట్లర్‌గా రికార్డు సాధించాడు.

Paris Olympics 2024 Lakshya Sen Wins First Indian Man to Reach Olympic Badminton Semifinals

తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. క్రాస్ కోర్టు షాట్లతో సత్తాచాటాడు. రెండో గేమ్‌ను 21-15తో సత్తాచాటాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థికి లక్ష్యసేన్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చైనీస్ తైపీ ఆటగాడిని చిత్తుగా ఓడించి ఘనంగా ముగించాడు.

ఈ పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో సింధు, క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించారు. దీంతో బ్యాడ్మింటన్‌లో ఆశలన్నీ లక్ష్యసేన్‌పైనే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లక్ష్యసేన్ సెమీస్‌కు చేరాడు. కాగా, ప్రిక్వార్టర్స్‌లోభారత్‌కే చెందిన హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ను 21-12, 21-6తో లక్ష్య చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 2, 2024, 22:40 [IST]
Other articles published on Aug 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+