Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: తెలుగోడి గురి అదిరింది..క్వార్టర్స్‌లో భారత్‌

పారిస్‌ ఒలింపిక్స్‌-2024లో తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర సత్తాచాటాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌ను క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ 16లో ధీరజ్ అంకిత భకత్‌తో కలిసి బరిలోకి దిగాడు. ఇండోనేషియా జోడీ ఆరిఫ్-కోరినిసాను ధీరజ్-అంకిత 5-1తో ((37-36, 38-38, 38-37) ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.

ధీరజ్-అంకిత జోడీ తొలి, మూడు సెట్‌లో 37-36, 38-37తో విజయం సాధించింది. కానీ సెకండ్ సెట్ 38-38తో సమమైంది. కాగా, ఈ విభాగంలో పతక రౌండ్లు కూడా ఇవాళే ఉన్నాయి. సెమీఫైనల్ బెర్త్ కోసం మన ఆర్చర్లు స్పెయిన్‌తో తలపడనుంది. కాగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్‌లో తరుణ్‌దీప్ రాయ్, రెండో రౌండ్‌లో బొమ్మదేవర ధీరజ్ తృటిలో గెలుపును చేజార్చుకున్న విషయం తెలిసిందే.

Paris Olympics 2024 India s Ankita-Dhiraj Reach Quarterfinals in Archery s Mixed Team Event

మరోవైపు మహిళల ఆర్చర్లు దీపికా కుమారి, భజన్ కౌర్ వ్యక్తిగత ఈవెంట్‌లో ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నారు. దేవరతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరిన అంకిత మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

Story first published: Friday, August 2, 2024, 15:43 [IST]
Other articles published on Aug 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+