Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: ఆర్చరీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భారత్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. మహిళల జట్టు విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అంకిత భకత్ అద్భుత ప్రదర్శనతో ఇండియా టాప్-4కు చేరింది. భజన కౌర్, దీపిక కుమారి కూడా సత్తాచాటారు. ఈ ముగ్గురమ్మాయిలు కలిసి 1983 పాయింట్లు సాధించారు. 21 బుల్‌ఐస్‌కు గురిపెట్టారు.

మరోవైపు మహిళల వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10ను చేజార్చుకుంది. 11వ స్థానంతో 666 పాయింట్లతో అంకిత సత్తాచాటింది. అయితే క్వార్టర్ ఫైనల్‌లో భారత్ మహిళల ఆర్చరీ జట్టు ఫ్రాన్స్ వర్సెస్ నెదర్లాండ్స్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.ఇక క్వార్టర్స్‌లో మన అమ్మాయిలు విజయం సాధిస్తే సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాతో తలపడే అవకాశం ఉంది.

Paris Olympics 2024 Indian Women s Archery Team Advances to Quarterfinals

టీమ్ సీడింగ్‌లో సౌత్‌కొరియా అగ్రస్థానంతో ముగించింది. 2046 పాయింట్లు సాధించింది. ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా ఇప్పటివరకు 27 ఆర్చరీ గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇక రెండో స్థానంలో చైనా (1996), మూడో స్థానంలో మెక్సికో (1986) ఉన్నాయి. కాగా, సౌత్ కొరియా చేతిలో ఓటిమిపాలైతే కాంస్య పతక రేసులో భారత్ పోటీపడాల్సి ఉంటుంది.

మన మహిళా ఆర్చర్లు అంకిత భకత్ 666 (11వ స్థానం), భజన కౌర్ 659 (22వ స్థానం), దీపిక కుమారి 658 (23వ స్థానం) అంచనాలకు తగ్గట్లుగా ముగించలేకపోయారు. ఆఖర్లో మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సౌత్ కొరియాతో పోటీని తప్పించుకునేవాళ్లం. జులై 28 నుంచి ఆగష్టు 4 వరకు ఫైనల్ రౌండ్ పోటీలు జరగనున్నాయి. కాగా, 1988 నుంచి ఒలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌ పోటీపడుతోంది. కానీ ఇప్పటివరకూ ఒక్క పతకమూ గెలవలేకపోయింది.

Story first published: Thursday, July 25, 2024, 15:48 [IST]
Other articles published on Jul 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+