Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics: తెలుగోడి ‘గురి’ అదిరింది..ఆర్చరీ‌లో భారత్ సంచలనం!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆర్చరీ‌లో భారత మహిళల జట్టు, పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 22 ఏళ్ల తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ సంచలన ప్రదర్శన చేశాడు. ధీరజ్ ఎక్కుపెట్టిన బాణాలకు మెన్స్ విభాగంతో పాటు మిక్సడ్ టీమ్‌లోనూ భారత్ సత్తాచాటింది. మిక్సడ్ టీమ్‌లో ధీరజ్-అంకిత అయిదో స్థానంలో నిలిచారు. మిక్సడ్ విభాగంలో ఇండియా రౌండ్-16కు క్వాలిఫై అయ్యింది.

గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత పురుషుల ఆర్చర్లు అదరగొట్టారు. ధీరజ్‌తో పాటు తరుణ్‌దీప్, ప్రవీణ్‌ సత్తాచాటడంతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2013 పాయింట్లతో సత్తాచాటింది. ఇక వ్యక్తిగత విభాగంలో ధీరజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. 681 పాయింట్లు సాధించాడు. తరుణ్‌దీప్ 674 పాయింట్లతో 14 స్థానంలో, ప్రవీణ్ 658 పాయింట్లతో 39వ స్థానంలో నిలిచారు.

Paris Olympics 2024 Indian Women s and Men s Teams Advance to Quarters Mixed Team Reaches Round of 16

విజయవాడకు చెందిన ధీరజ్‌ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఆర్చరీలో దేశానికి తొలి పతకం అందించడానికి కసిగా బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నాడు. ఇక మహిళల ఆర్చరీ విషయానికొస్తే... మహిళల జట్టు విభాగంలోనూ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అంకిత భకత్ అద్భుత ప్రదర్శనతో ఇండియా టాప్-4కు చేరింది. భజన కౌర్, దీపిక కుమారి కూడా సత్తాచాటారు. ఈ ముగ్గురమ్మాయిలు కలిసి 1983 పాయింట్లు సాధించారు.

మరోవైపు మహిళల వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10ను చేజార్చుకుంది. 11వ స్థానంతో 666 పాయింట్లతో అంకిత నిలిచింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత్ మహిళల ఆర్చరీ జట్టు ఫ్రాన్స్ వర్సెస్ నెదర్లాండ్స్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.ఇక క్వార్టర్స్‌లో మన అమ్మాయిలు విజయం సాధిస్తే సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాతో తలపడే అవకాశం ఉంది.

టీమ్ సీడింగ్‌లో సౌత్‌కొరియా అగ్రస్థానంతో ముగించింది. 2046 పాయింట్లు సాధించింది. ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా ఇప్పటివరకు 27 ఆర్చరీ గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇక రెండో స్థానంలో చైనా (1996), మూడో స్థానంలో మెక్సికో (1986) ఉన్నాయి. కాగా, సౌత్ కొరియా చేతిలో ఓటిమిపాలైతే కాంస్య పతక రేసులో భారత్ పోటీపడాల్సి ఉంటుంది.

మన మహిళా ఆర్చర్లు అంకిత భకత్ 666 (11వ స్థానం), భజన కౌర్ 659 (22వ స్థానం), దీపిక కుమారి 658 (23వ స్థానం) అంచనాలకు తగ్గట్లుగా ముగించలేకపోయారు. ఆఖర్లో మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సౌత్ కొరియాతో పోటీని తప్పించుకునేవాళ్లం. జులై 28 నుంచి ఆగష్టు 4 వరకు ఫైనల్ రౌండ్ పోటీలు జరగనున్నాయి. కాగా, 1988 నుంచి ఒలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌ పోటీపడుతోంది. ఇప్పటివరకూ ఒక్క పతకమూ గెలవలేకపోయింది. కానీ ఈ సారి పతక నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది.

Story first published: Thursday, July 25, 2024, 20:31 [IST]
Other articles published on Jul 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+