విశ్వక్రీడలకు వేళైంది. మరికొన్ని గంటల్లో పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. అయితే ఈ క్రీడా మహా సమరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 6 క్రీడాంశాల్లో 117 మంది భారత క్రీడాకారులు పతకాలకు వేటకు సిద్ధమయ్యారు. అయితే అథ్లెట్లలో 11 ఏళ్ల చిన్నారితో పాటు 61 ఏళ్ల బామ్మ కూడా ఉంది.
ఈ సారి ఒలింపిక్స్‌లో సగం మంది మహిళలు, పురుషులు పాల్గొననున్నారు. ఒలింపిక్ చరిత్రలో లింగ సమానత్వంతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 1972 మ్యూనిచ్ విశ్వక్రీడలకు ముందు కనీసం 20శాతం మంది మహిళలు కూడా పోటీపడలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే.. మహిళల మారథాన్‌తో క్రీడలు ముగియనున్నాయి. సాధారణంగా పురుషుల మారథాన్‌తో ఒలింపిక్స్ ముగుస్తాయన్న విషయం తెలిసిందే.

పారిస్ విశ్వక్రీడల్లో పాల్గొనే అత్యంత పిన్నవయస్కురాలిగా చైనాకు చెందిన 11 ఏళ్ల చిన్నారి జెంగ్ హావోహావో నిలిచింది. జెంగ్ మహిళల స్కేట్‌బోర్డింగ్ ఈవెంట్‌లో పాల్గొనుంది. ఇక భారత జట్టులో అత్యంత చిన్న వయస్సు అథ్లెట్‌గా స్విమ్మర్ ధినిధి దేషింగు నిలిచింది. ధినిధి వయస్సు 14 ఏళ్లు. ఒలింపిక్ చరిత్రలో పిన్న వయస్సులో బరిలోకి దిగుతున్న రెండో భారత్ ప్లేయర్‌గా ధినిధి చరిత్ర సృష్టించింది.
కెనడాకు చెందిన జిల్ ఇర్వింగ్ 61 ఏళ్ల వయసులో పారిస్ క్రీడల్లో పతక లక్ష్యంగా రంగంలోకి దిగుతోంది. ఈమె ఈక్వెస్ట్రియన్ జట్టులో సభ్యురాలు. జిల్ ఇర్వింగ్‌కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం గమనార్హం. ఇక భారత బృందంలో టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న పెద్ద వయస్కుడు. బోపన్న వయస్సు 44 ఏళ్లు. రూ.1.17 లక్షల కోట్లు. కాగా, పారిస్ ఒలింపిక్స్ కోసం సుమారు రూ.1.17 లక్షల కోట్లు వెచ్చించనున్నారు. దాదాపు కోటి 10 లక్షల మంది పర్యాటకులు పోటీలను వీక్షించనున్నారు.