Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: గురితప్పింది! ఒక్క పాయింట్‌తో చేజారిన పతకం

పారిస్ ఒలింపిక్స్‌-2024లో తొలి రోజున భారత్‌కు పతకం చేజారింది. భారత షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ మిక్స‌డ్ విభాగంలో మెడల్‌ను సాధించలేకపోయారు. శనివారం జరిగిన షూటింగ్‌ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఎలవెనిల్‌ వలరివన్‌- సందీప్‌ సింగ్, అర్జున్‌ బబుతా- రమిత జోడీలు ఫైనల్‌కు అర్హత సాధించలేదు.

628.7 పాయింట్లతో అర్జున్ బబుతా-రమిత ఆరో స్థానంలో, వలరివన్-సందీప్ సింగ్ 623.6 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. అయితే అర్జున్-రమిత ఒక్క పాయింట్‌తో కాంస్య పతక పోరుకు అర్హత సాధించలేకపోయారు. నాలుగో స్థానంలో జోడికి అర్జున్-రమిత ద్వయానికి మధ్య అంతరం ఒక్క పాయింటు మాత్రమే. మరో పాయింటు సాధించి ఉంటే భారత్ కాంస్య పతక పోరులో నిలిచేది.

Paris Olympics 2024 Heartbreak for India as Arjun and Ramita Miss Bronze Medal Match by Just One Point

కాగా, ప్రతి షూటర్ పోటీలో 30 షాట్స్ కాలుస్తాడు. జోడీలో ఇద్దరి స్కోరును కలిపి అర్హతకు ప్రామాణికంగా చూస్తారు. టాప్‌-4లో ఉన్న వాళ్లు మెడల్ పోరుకు అర్హత సాధిస్తారు. తొలి రెండు స్థానాల్లో ఉన్న జంటలు స్వర్ణానికి పోటీపడతారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వాళ్లు కాంస్యం కోసం పోరాడతారు. చైనా (632.2), కొరియా (631.4), కజకిస్థాన్ (630.8), జర్మనీ (629.7) టాప్-4లో నిలిచాయి.

ఇక ఇవాళ భారత క్రీడాకారుల పతకాలు సాధించే పోటీలు లేవు. క్వాలిఫికేషన్ రౌండ్లు, తదుపరి దశకు అర్హత సాధించే పోరులు మాత్రమే ఉన్నాయి. కాసేపట్లో షూటింగ్‌లో పురుషుల, మహిళల విభాగంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే 10మీ.ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌‌లో అర్జున్, సరబ్‌జోత్‌ బరిలోకి దిగుతున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ఆరంభమయ్యే మహిళల విభాగంలో మను బాకర్, రిథమ్‌ సంగ్వాన్‌ ఆడనున్నారు.

Story first published: Saturday, July 27, 2024, 14:08 [IST]
Other articles published on Jul 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+