Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 10th August Schedule: రితీక పైనే భారత్ ఆశలు,కంప్లీట్ షెడ్యూల్ ఇదే..!!

మరో రెండ్రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి.ఇక భారత్ నుంచి రెండు ఈవెంట్స్‌లో ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటారు. ఆగష్టు 10వ తేదీ శనివారం రోజున పతకం కోసం రితికా హూడా రెజ్లింగ్ బరిలో దిగనుంది. భారత్ మరో పతకం పై ఆశపెట్టుకుంది. ఇక గోల్ఫ్‌లో కూడా భారత్ పాల్గొననుంది.

మహిళల 76 కేజీ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రితికా హూడా ఫైనల్స్‌కు చేరితే పతకం తప్పకుండా వస్తుంది. దీంతో భారత పతకాల పట్టికలో మరో పతకం వచ్చి చేరుతుంది.ఒకవేళ సెమీఫైనల్స్‌లో రితికా హుడా ఓటమి చెందింతే.. ఒలింపిక్స్ చివరి రోజున కాంస్య పతకం కోసం బరిలో దిగుతుంది. ఒక వేళ రితిక మెడల్‌ రౌండ్‌కు జరిగే పోటీలోనే నిష్క్రమిస్తే ఇక శనివారం రోజునే భారత్ ఒలింపిక్స్ యాత్ర ముగుస్తుంది.

Paris Olympics 2024 fixtures India Schedule on day 15th saturday August 10th

ఇదిలా ఉంటే గోల్ఫ్ క్రీడాకారిణిలు అదితి అశోక్, దీక్షా దగర్‌ మహిళల ఇండివిజువల్ స్ట్రోక్ ప్లేలో పాల్గొంటారు. అయితే మెడల్ రౌండ్‌ కోసం జరిగే పోటీల్లో విజేతగా నిలిస్తే ముందుకు కొనసాగుతారు. భారత్ శనివారం ఆగష్టు 10న పాల్గొనే క్రీడలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇదే.

మధ్యాహ్నం 12:30 గంటలకు మహిళల గోల్ఫ్ స్ట్రోక్ ప్లే రౌండ్ ఫోర్‌లో అదితి అశోక్, దీక్ష దగర్‌లు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మహిళల 76 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో రీతికా హూడా హంగేరీకి చెందిన బెర్నాడేతో పోటీ పడుతుంది. ఒక వేళ క్వాలిఫై అయితే సాయంత్రం 4:20 గంటలకు రీతికా హూడా క్వార్టర్స్‌లో తలపడుతుంది. క్వార్టర్స్‌లో కూడా క్వాలిఫై అయితే రాత్రి 10:30 గంటలకు జరిగే సెమీ ఫైనల్స్‌లో పోటీపడుతుంది. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టిక గమనిస్తే 5 పతకాలతో కొనసాగుతోంది.

Story first published: Friday, August 9, 2024, 18:18 [IST]
Other articles published on Aug 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+