Paris Olympics 2024: ఫ్రీగా ఎలా చూడాలంటే? ఒలింపిక్స్ పూర్తి వివరాలు!
పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో 14 రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. అయితే ఈ అతి పెద్ద క్రీడా ఈవెంట్‌కు సంబంధించి అందరికీ కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. ఏఏ ఆటలు ఎప్పుడు? టైమింగ్స్ ఏంటి? మొబైల్స్, టీవీల్లో ఎలా వీక్షించాలి?
ఎవరెరవరు పాల్గొంటున్నారు? రష్యాకు అనుమతి ఉందా? ఆరంభోత్సవ వేడుకులు ఎప్పుడు జరుగుతాయి?
ఇలా కొన్ని ప్రశ్నలు అందరికీ కామన్‌గా వస్తున్నాయి. వాటికి సమాధానాలు.... ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇస్తుంది. గతంలో ఫ్రాన్స్ 1900, 1924లో కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు వందేళ్ల తర్వాత మరోసారి విశ్వక్రీడలకు ఫ్రాన్స్ వేదికగా నిలుస్తుంది.

ప్రారంభ వేడుకలు ఎక్కడ?
ఆరంభోత్సవ వేడుకలు జులై 26వ తేదీన జరగనున్నాయి. అయితే ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ కాస్త భిన్నంగా ఉంటుంది. పారిస్‌లో ప్రవహించే సెన్ నదిపై నిర్వహించనున్నారు. ఆరంభోత్సవ వేడుకలు స్టేడియంలో కాకుండా ఆరుబయట నదిలో జరగనుండటం ఇదే ప్రథమం.
ఆర్చరీ పోటీలు జులై 25 నుంచే ప్రారంభం కానున్నాయి. ఆ రోజున క్వాలిఫికేషన్ పోరు ఉంటుంది. ఆగష్టు 4వ తేదీ వరకు టీమ్, వ్యక్తిగత విభాగాల ఆర్చరీ పోటీలు జరుగుతాయి. ఇక అథ్లెటిక్స్ హవా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. వచ్చే నెల 1 నుంచి రేస్ వాక్‌తో అథ్లెటిక్స్ పోటీలు మొదలుకానున్నాయి. ఆగస్టు 10వరకు ఇవి కొనసాగుతాయి.
బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీలు జులై 27న మొదలవుతాయి. అయితే బ్యాడ్మింట్ ఫైనల్స్ ఆగస్టు 5 వరకు, బాక్సింగ్ ఫైనల్స్ ఆగస్టు 11న ఉన్నాయి. ఫీల్డ్ హాకీలో మన మ్యాచ్‌లు జులై 27 నుంచి ఆగస్టు 2వరకు ఉన్నాయి. ఆగస్టు 4, 6వ తేదీల్లో సెమీఫైనల్స్, 8వ తేదీన ఫైనల్ జరుగుతుంది. ఇక జులై 27న ఆగష్టు 5వరకు షూటింగ్, బ్యాడ్మింటన్; జులై 27 నుంచి ఆగస్టు 10 వరకు టేబుల్ టెన్నిస్ జరగనున్నాయి. ఆగస్టు 7న వెయిట్ లిఫ్టింగ్, ఆగస్టు 5న రెజ్లింగ్ పోటీలు మొదలవుతాయి.
జియో సినిమాలో ఫ్రీ
స్పోర్ట్స్18 నెట్‌వర్క్, ఓటీమీ ప్లాట్‌ఫారమ్ జియోసినిమాలో పారిస్ ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. భారత సమయం పారిస్ కంటే 3.30 గంటలు ముందుంటుంది. పారిస్‌లో గేమ్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 వరకు జరుగుతాయి. మన టైమింగ్స్‌లో ఉదయం 11 ఆటలు మొదలవుతాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా, దాని మిత్ర దేశమైన బెలారస్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అయితే ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లు న్యూట్రల్స్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. విశ్వక్రీడలకు దాదాపు 45 వేల మంది పోలీసు ఆఫీసర్లు సెక్యూరిటీగా పనిచేయనున్నారు. అంతేగాక విదేశీ సెక్యూరిటీ అఫిషయల్స్ కూడా భద్రత ఇవ్వనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications