Paris Olympics: ప్రధాని మోదీతో తెలుగు అథ్లెట్లు (Video)
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గురువారం కలిశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో విశ్వక్రీడలకు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్, ర్యాంక్‌ల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి 28 మంది అథ్లెట్లకు చోటు దక్కింది.
ఈ నేపథ్యంలో అర్హత సాధించిన అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది ప్రధానిని కలిశారు. వాళ్లలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు దండి జ్యోతిక శ్రీ, జ్యోతి యర్రాజి కూడా ఉన్నారు. క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవ్య, క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష కూడా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ క్రీడాకారులతో మాట్లాడారు. అథ్లెట్లకు అభినందనలు చెప్పారు. విశ్వక్రీడల్లో దేశం గర్వించే ప్రదర్శన చేస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీనికి సంబధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి మోదీ పంచుకున్నారు. ''పారిస్‌కు వెళ్లే భారత జట్టుతో ముచ్చటించాను. మన అథ్లెట్లు దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకముంది. వారి విజయాలు 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి కావాలి'' అని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సింగ్ ప్రపంచ ఛాంప్ నిఖత్ జరీన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధులతో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications