Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళా స్విమ్మర్లను వీడియో తీశాడని 3 ఏళ్ల పాటు నిషేధం

Para-swimmer Prasanta Karmakar suspended for recording video of female swimmers

హైదరాబాద్: మహిళా స్విమ్మర్లను షూటింగ్ చేస్తున్నాడని 3ఏళ్ల పాటు పారాస్విమ్మర్‌ను ఒలింపిక్‌కు దూరం చేసింది. దేశానికి ఎన్నో పతకాలు సాధించిన పారా స్విమ్మర్ కెరీర్‌పై మాయని మచ్చపడింది.

2016లో రియో పారాఒలింపిక్స్‌కు వెళ్లిన స్విమ్మింగ్‌ జట్టుకు కోచ్‌గా కూడా పని చేశాడు. ఇంతటి సీనియర్‌ ఆటగాడిపై భారత ఒలింపిక్‌ సంఘం వేటు వేయడానికి ప్రధాన కారణం. అతని అసభ్య ప్రవర్తనే.. మహిళా స్విమ్మర్లు స్విమ్మింగ్‌ చేస్తుంటే ప్రశాంత్‌ వీడియోలు తీశాడు.

దీనిపై విచారించగా అది నిజమని తేలడంతో ఒలింపిక్‌ సంఘం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో.. పారా స్విమ్మర్‌ ప్రశాంత్‌ కర్మాకర్‌పై భారత ఒలింపిక్‌ కమిటీ వేటు వేసింది.

ఇక, అతడు మూడేళ్లపాటు ఏ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలు లేదు. అర్జెంటీనాలో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన ఏకైక భారతీయ ఆటగాడు ప్రశాంత్‌. 37ఏళ్ల కర్మాకర్ 2011లో అర్జున, 2015లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌, 2014లో భీమ్‌ అవార్డులతో పాటు 2009, 2011లో స్విమ్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గాను ప్రశాంత్‌ నిలిచాడు.

Story first published: Thursday, March 1, 2018, 13:14 [IST]
Other articles published on Mar 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+