
హైదరాబాద్: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మయన్మార్ రాజధాని యాంగన్ యాంగాన్‌లోని గ్రాండ్ మెర్కరీ సెంటర్‌లో జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య దేశానికి చెందిన నెయ్ థే ఓపై 6-2తో విజయం సాధించాడు.
వరల్డ్ బిలియర్డ్స్ ఫైనల్స్ 150 పాయింట్ల ఫార్మాట్‌లో జరగడం విశేషం. తాజా ట్రోఫీతో పంకజ్ అద్వానీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. క్యూ స్పోర్ట్స్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిసి పంకజ్ అద్వానీకి ఇది 20వ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు గత రెండు వారాల్లో పంకజ్ అద్వానీ నెగ్గిన రెండో టైటిల్ కావడం విశేషం.
33 ఏళ్ల పంకజ్ అద్వానీ ఫైనల్లో 150-21, 0-151, 151-0, 4-151, 151-11, 150-81, 151-109, 151-0 ఫ్రేమ్ స్కోర్లను సాధించి విజయం సాధించాడు. ఓపెనింగ్ గేమ్‌లో 108 పాయింట్ల వద్ద గేమ్ విన్నింగ్ బ్రేక్‌ను పొందాడు. ఆ తర్వాత అదే దూకుడుని పంక్ అద్వానీ కొనసాగించాడు. ఈ ఏడాది పంకజ్ అద్వానీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
మళ్లీ వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పంకజ్ అద్వానీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇటీవలే, చైనాలోని జినాన్ వేదికగా ఆసియా స్నూకర్ టూర్ రెండో అంచె టోర్నీ ఫైనల్లో చైనా ఆటగాడు జు రెటిపై 6-1తేడాతో పంకజ్ అద్వానీ విజయం సాధించి స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో దోహా వేదికగా జరిగిన తొలి అంచె పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న పంకజ్ అద్వానీ ఇప్పుడు స్వర్ణం సాధించాడు.
పంకజ్‌కు ఇది రెండో ఆసియా ఆసియా స్నూకర్ టైటిల్ కావడం విశేషం. 2003లో చైనా గడ్డపైనే తన తొలి ఆసియా స్నూకర్ టైటిల్‌ను పంకజ్ నెగ్గాడు. మళ్లీ పదిహేనేళ్ల తర్వాత అదే చైనీస్ గడ్డపై ఇప్పుడు మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.