For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20ఏళ్లలో తొలిసారి: ఆసీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన పాక్

అబుదాబి: పాకిస్థాన్ జట్టు 20ఏళ్లలో తొలిసారిగా ఆస్ట్రేలియాపై గెలిచి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. 356 పరుగుల తేడాతో అబుదాబిలో సోమవారం జరిగిన రెండో టెస్టులోనూ పాకిస్థాన్... ఆస్ట్రేలియాపై గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ అనూహ్య విజయంతో అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు మూడో ర్యాంకుకు చేరుకుంది.

కాగా, తొలి స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. షేక్‌జాయేద్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచులో పాకిస్థాన్ స్పిన్నర్ జుల్ఫికర్ బాబర్(5/120), యాసిర్ షా(3/44) అద్భుతంగా రాణించడంతో 246 పరుగులకు అలౌటైంది.

దుబాయ్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 221 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 570/6కి డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాను 261 పరుగులకు అలౌట్ చేసిన పాక్, 309 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Pakistan win first Test series against Australia in 20 years

1994లో పాకిస్థాన్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-0తో కోల్పోయిన తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా ఇప్పుడే ఓటమిని ఎదుర్కొంది. 1928లో బ్రిస్బేన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచులో 675 పరుగుల తేడాతో, ఆ తర్వాత 1980లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచులో 408 పరుగులతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఇప్పుడు పాక్ చేతిలో 356పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

తన సారథ్యంలో తమ జట్టుకు లభించిన ఈ విజయాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అందరూ సమష్టిగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నాడు. ఈ విజయంపై తన అనుభవాన్ని వివరించలేకపోతున్నానని తెలిపాడు. మంచి క్రికెట్ ఆడి సమష్టిగా విజయం సాధించామని చెప్పారు. పాక్ ఆటగాళ్లు రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా ఆడారని ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+