For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్‌కప్ నుంచి భారత్ నిష్క్రమణ: పాక్ మీడియాతో పాటు ఫ్యాన్స్ హ్యాపీ, ప్రతీకారంగా...!

By Nageswara Rao

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా సెమీ పైనల్స్‌లో నిష్క్రమించింది. ఈ వార్త టీమిండియా అభిమానులకు చేదు వార్త అయితే పాకిస్ధాన్ అభిమానులకు మాత్రం శుభవార్త. భారత్ ఓటమిని పాకిస్ధాన్‌కు చెందిన అభిమానులతో పాటు మీడియా కూడా పండుగ చేసుకున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో ఆస్టేలియా చేతిలో 95 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. భారత్ నిష్క్రమిణపై పాకిస్ధాన్‌లోని టాప్ మీడియా కంపెనీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టికల్స్ రాశాయి.

దీంతో పాటు వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్ ఆటగాళ్లు ఆటతీరుని ఎండగడుతూ ఆర్టికల్స్ రాశాయి. పాకిస్ధానీ జాతీయ న్యూస్ పేపర్ "Seven reasons why Pakistani's should be happy about India's defeat," అంటూ ఓ పెద్ద వార్తా కథనాన్ని రాసింది. భారత్‌పై ఉన్న అక్కసుని ఈ విధంగా కూడా పాకిస్దాన్ వెళ్లగక్కింది.

అసలు పాకిస్ధాన్ అభిమానులు ఇంత దారుణంగా భారత్ గురించి ఆలోచించడానికి గల కారణం. వరల్డ్ కప్‌లో అడిలైడ్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్ధాన్‌పై భారత్ 76 పరుగుల తేడాతో విజయాన్ని సాధించడమే. సెమీ పైనల్‌లో ఆసీస్ చేతిలో భారత్‌ ఓటమిని ప్రతీకారంగా భావించారు.

అంతేకాదు ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్స్‌లో పాకిస్ధాన్‌పై భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమిని చవి చూడలేదు. మార్చి 15న జరిగిన వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో పాకిస్ధాన్‌పై గెలిచిన విజయం టీమిండియాకు ఏడవది.

Pakistan Fans Seize Their 'Mauka', Call India's World Cup Exit Their 'Revenge'

ఇలా ప్రతిసారి భారత్ చేతిలో ఓటమిని చవిచూస్తున్న పాకిస్ధాన్ జట్టు, ఆ దేశ అభిమానులు సెమీ పైనల్ ఆస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌కే మద్దతు తెలపడంతో పాటు భారత్ ఓడిపోవాలని ప్రత్యేక ప్రార్ధనలు కూడా నిర్వహించారని ఆ దేశ వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి.

వరల్డ్ కప్‌‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్ ఓటమిపై పాకిస్ధానీ యువత మౌకా మౌకా యాడ్ క్యాంపెన్లు కూడా నిర్వహించింది. అయితే పాకిస్ధాన్‌లోని ఉన్న అందరూ పైవిధంగా సంబరాలు జరుపుకోలేదని, కొంత మంది ధోని సేనకు మద్దతుగా నిలిచారని కూడా వార్తా ఛానెళ్లు పేర్కొన్నాయి.

కొంతమంది పాకిస్ధాన్ ఫైనల్‌కు చేరుకోకపోయినా, భారత్ అయినా ఫైనల్‌కు చేరుకోవాలని ఆకాంక్షించారని పేర్కొన్నాయి. మరికొంత మంది ఉపఖండం నుంచి ఒక్క జట్టు కూడా లేకపోవడం అభిమానులుగా బాధించిందని అన్నట్లు పేర్కొన్నాయి.



ఇక ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ రేసులో అతిథ్య దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఉపఖండానికి చెందిన జట్లు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు క్వార్టర్స్ లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+