Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చంపేస్తాడనుకున్నా: పిస్టోరియస్ మాజీ లవర్ సమంత

కేప్‌టౌన్: ప్రేయసి రీవా స్టీన్ కాంప్‌ను హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌పై మరో మాజీ ప్రేయసి తీవ్రమైన ఆరోపణలు చేసింది. పిస్టోరియస్ మాజీ ప్రేయసి సమంత టేలర్ మీడియాతో మాట్లాడుతూ.. 'రీవా స్టీన్ కాంప్‌ను పొరపాటున కాల్చి చంపానని పిస్టోరియస్ అంటున్నప్పటికీ.. అతడు చాలా ప్రమాదకర వ్యక్తి' అని తెలిపింది.

అంతేగాక 'రీవా కంటే ముందు నేను బలవాల్సింది. రీవా చనిపోయినప్పుడు చాలా మంది నేనే చనిపోయానని అనుకున్నారు. నా మృతికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు కూడా పంపారు' అని సమంతా టేలర్ పేర్కొంది.

Oscar Pistorius' Ex-Girlfriend: 'It Could've Been Me'

పిస్టోరియస్‌తో ఉన్నంత కాలం తాను భయపడుతూనే ఉన్నానని చెప్పింది. అతను తనను అనుమానించేవాడని, తన జీవితంలో మరెవరైనా ఉండేవారేమో అని తరచుగా తన మొబైల్ ఫోన్ చూస్తుండేవాడని లిపింది. పిస్టోరియస్‌కు తుపాకీలంటే పిచ్చిన సమంతా టేలర్ చెప్పింది. అతడి దగ్గర ఎప్పుడూ తుపాకీలుండేవని తెలిపింది. కాగా, రీవా హత్య కేసులో సమంతా టేలర్ కూడా కోర్టు విచారణలో సాక్ష్యం తెలిపింది.

పిస్టోరియస్ నిరుడు ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి తన ప్రియురాలు రీవాను కాల్చి చంపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆమెను హత్య చేయలేదని, ఇంట్లోకి ఎవరో ఆగంతకులు చొరబడ్డారని భ్రమపడి జరిపిన కాల్పుల్లో ఆమె మృతి చెందిందని పిస్టోరియస్ వాదించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+