ఆరంభం అదుర్స్: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో 6 బెస్ట్ మూమెంట్స్
రియో డీ జనీరో: ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబురంగా భావించే ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం 4 గంటల సమయంలో ప్రఖ్యాత మరకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా 207 దేశాల నుంచి రియో ఒలంపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లంతా కూడా ఈ ఆరంభ వేడుకల్లో భాగంగా మరకానా స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, అథ్లెట్ల కవాతులు, ఆకట్టుకునే నృత్యాల మధ్య రియో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి.
సాంబా నృత్యాలు, కార్నివాల్ డాన్స్‌లు, వీనుల విందైన సంగీత కార్యక్రమాలతో వీక్షకులను కట్టిపడేశాయి. సూపర్ మోడల్ గిసెలీ బుంద్ చెన్, ట్రాన్స్ జెండర్ బ్యూటీ లీ టీ ఈ వేడుకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్రెజిల్‌లో బాగా ప్రజాదరణ పొందిన గర్ల్ ఫ్రమ్ ఇపనెమా పాటకు ఈ ఇద్దరూ ఆడిపాడారు.
బ్రెజిల్ టాప్ సంగీత దర్శకులు కెటానో వెలో సో, గిల్బర్ట్ గిల్‌లు తమ సంగీతంతో హోరెత్తించారు. దాదాపు నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ థీమ్ షో ఆరంభ వేడులకే హైలెట్‌గా నిలిచింది. ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ మరకానాతో సహా మొత్తం 37 వేదికల్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ ఇమేజిలో భాగంగా ఐదు రింగులతో కూడిన అద్భుతమైన ఫోటో.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
రియో ఒలింపిక్స్ వేడుకల్లో శాంతి సందేశం. రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ఓ అభిమాని పెంగ్విన్ ఆకారంలో ఉన్న పేపర్ కటింగ్‌పై శాంతి సందేశాన్ని చూపుతున్నాడు.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రియో ఒలింపిక్స్ జ్యోతి వెలుగు.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల గ్రూప్ ఫోటో. ప్రపంచ వ్యాప్తంగా 207 దేశాల నుంచి రియో ఒలంపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లంతా కూడా ఈ ఆరంభ వేడుకల్లో భాగంగా మరకానా స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరిగిన ప్రఖ్యాత మరకానా స్టేడియం పైనుంచి ఇలా కనిపించింది. భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం 4 గంటల సమయంలో ప్రఖ్యాత మరకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
మరకానా స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒలింపిక్స్ అభిమానులు. రియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి 70 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు.

రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభ వేడుక ఫోటోలు
కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగు ఒకవైపు, అథ్లెట్ల కవాతులు, అలరించే నృత్యాలు మరోవైపు.. వీటన్నిటి మధ్య బ్రెజిల్‌లో రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లేజర్ షో వీక్షకులను అబ్బురపరిచాయి. 4800 మంది కళాకారులతో భారీ నృత్య ప్రదర్శనలు అహుతులను కట్టిపడేశాయి.
రియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి 70 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే 100 కోట్ల మంది టీవీల ద్వారా వీక్షించారు. భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా ఆరంభోత్సవంలో మన బృందానికి నాయకత్వం వహించాడు.
ఈసారి భారత్ నుంచి అత్యధిక స్థాయిలో 118 మంది ఒలింపిక్స్ లో బరిలోకి దిగుతున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం బ్రెజిల్ ఎనిమిదిన్నర గంటలు వెనుకగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ పోటీలు జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications