వెక్కి ఏడ్చిన సౌతాఫ్రికా: బాధిస్తోందన్న 'సిక్సర్' ఎలియోట్, స్టెయిన్‌పై..
అక్లాండ్: సెమీ ఫైనల్లో భాగంగా అక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో సోతాఫ్రికా చిత్తయింది. దీనిపై.. చివరలో సిక్సర్ బాది కివీస్‌ను గెలిపించిన సౌతాఫ్రికా జొన్నస్‌బర్గ్‌కు చెందిన ఎలియోట్ స్పందించాడు. అతను దక్షిణాఫ్రికాలో పుట్టినప్పటికీ కివీస్ తరఫున ఆడుతున్నాడు. సౌతాఫ్రికా ఓటమిపై అతను మాట్లాడాడు.
డెల్ స్టెయిన్, ఇతర సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్ల ఆవేదన గురించి చెబుతూ.. తాను బాధపడుతున్నట్లు చెప్పాడు. సౌతాఫ్రికా ఓడిపోగానే మోర్కెల్, డివిల్లియర్స్‌లు కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. డెల్ స్టెయిన్ బౌలింగులో ఎలియాట్ సిక్స్ కొట్టి కివీస్‌ను గెలిపించాడు.

ఇది ఆటలో భాగమని వారు (సౌతాఫ్రికా) భావించాలని, జయాపజయాలు సాధారణమేనని చెప్పాడు. తన ఆట ఆటలో భాగమే అన్నాడు. స్టెయిన్ గురించి తాను ఆవేదన చెందుతున్నట్లు చెప్పాడు. సౌతాఫ్రికా ఓటమి నేపథ్యంలో ఆ జట్టు మిగతా సభ్యుల ఆవేదనను కూడా తాను అర్థం చేస్కున్నానని, దానికి బాధపడుతున్నట్లు చెప్పాడు.
డక్ వర్తలూయిస్ కూడా కారణం
ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో డక్ వర్తలూయిస్ కూడా న్యూజిలాండ్ ఫైనల్‌కు వెళ్లేందుకు కారణమైందని చెప్పాడు. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌కు వర్షం పడటంతో.. డక్ వర్తలూయిస్ పద్ధతి ప్రకారం.. తొలుత దక్షిణాఫ్రికా 43 ఓవర్లలో 281 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 43 ఓవర్లలో 298 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications