ఒకప్పటి టీమిండియాలో కీలకపాత్ర పోషించిన ఫేసర్ ఆశిష్ నెహ్రా ఇంగ్లాండ్ తో ప్రకటించిన రెండు వన్డేల జట్టులో స్దానం లభించక పోవడంతో అసహానాన్ని వ్యక్తం చేశాడు. నేను ప్రస్తుతం ఫిట్ గా ఉన్నప్పటికీ కూడా సెలక్టర్స్ ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ లో జరిగిన వన్డే సిరీస్ కు ముందే నా ఫిట్ నెస్ సర్టిఫికెట్ ని టీమిండియా సెలక్టర్స్ కి పంపడం జరిగింది. అంతేకాకుండా సెలవుల్లో ఉన్న ఆర్పీ సింగ్ ను పిలిపించారు కానీ ఇక్కడే ఉన్న నన్ను మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. అసలు టీమిండియా సెలక్టర్స్ ఏ ప్రాదిపదికిన ఆటగాళ్లను సెలక్ట్ చేస్తారో అర్థం కావడం లేదు. 2009లో తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచి జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ను నేను. ప్రపంచకప్ సెమీస్ లో నా వేలికి గాయమైంది, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను గాయాల భారిన పడిన సందర్బం లేదు.గత రెండేళ్లకాలం నుంచి చివరి స్లాగ్ లో ఎవరెక్కువ ఓవర్లు వేసిందో ఓసారి పరిశీలించుకోండి. చాలెంజర్స్ సిరీస్ లోనూ నాకు చాన్స్ ఇవ్వకపోతే నా ఫిట్ నెస్ ను ఎలా నిరూపించుకోగలను? కేరళ నుంచి శ్రీనగర్ దాకా అందరికీ అవకాశం ఇచ్చారు.. ఒక్క నెహ్రాకు తప్ప. కొన్ని నెలల వ్యవధిలోనే నేనంత చెత్త బౌలర్ గా మారానా? అని 32 ఏళ్ల నెహ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. వయస్సురీత్యా కూడా సెహ్వాగ్ కన్నా చిన్నవాణ్ణేనని.. అదే సమస్య అయితే ద్రవిడ్ 39 ఏళ్ల వయస్సులో తిరిగి వన్డే జట్టులోకి రాగలిగేవాడేనా అని ప్రశ్నించాడు. బీసీసీఐ అనుమతిస్తే బిగ్ బాష్, ప్రో-40 సిరీస్ లో ఆడేందుకు వెళతానని చెప్పాడు.ఇది ఇలా ఉంటే ఇంగ్లండ్ తో జరిగే వన్డేలకు భారత జట్టులో స్థానం కోల్పోయిన హర్భజన్ సింగ్, ఎన్ కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో ఇండియా గ్రీన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. గాయంనుంచి కోలుకున్న గౌతం గంభీర్ ఇండియా రెడ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గురువారం చెన్నైలో సెలక్షన్ కమిటీ ఈ టోర్నీ కోసం ఇండియా బ్లూ, గ్రీన్, రెడ్ జట్లను ఎంపిక చేసింది.ఇండియా బ్లూ టీమ్ లో ప్రజ్ఞాన్ ఓజాకు చోటు దక్కించుకోగా, ఐపీఎల్ లో సత్తా చూపించిన మరో ఇద్దరు హైదరాబాదీలు అంబటి రాయుడు, తిరుమలశెట్టి సుమన్ కూడా ఈ టోర్నీలో చోటు కల్పించారు. ఇండియా రెడ్ జట్టుకు రాయుడు, ఇండియా గ్రీన్ కు సుమన్ ఎంపికయ్యారు. అక్టోబరు 10 నుండి 13వరకు నాగ్ పూర్ లో ఈ టోర్నీ జరుగుతుంది.జట్ల వివరాలు:ఇండియా బ్లూ: బద్రీనాథ్ (కెప్టెన్ ), మురళీ విజయ్ , మనీష్ పాండే, దినేష్ కార్తీక్ , మణ్ దీప్ సింగ్ , సౌరబ్ తివారీ, ఇర్ఫాన్ పఠాన్ , అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓజా, ప్రశాంత్ , కృష్ణన్ , ప్రదీప్ సంగ్వాన్ , తన్మయ్ శ్రీవాస్తవఇండియా గ్రీన్ : హర్భజన్ (కెప్టెన్ ), రాబిన్ ఉతప్ప, అనిరుధ, టి.సుమన్ , మోనీష్ మిశ్రా, ఇషాంక్ జగ్గి, మహ్మద్ కైఫ్ , గౌతం, సరబ్ జీత్ , ఇక్బాల్ అబ్దుల్లా, అభిమన్యు మిథున్ , సమద్ , ఈశ్వర్ , సుమిత్ నర్వాల్ ఇండియా రెడ్ : గంభీర్ (కెప్టెన్ ), శిఖర్ ధావన్ , అబినవ్ ముకుంద్ , అంబటి రాయుడు, అశోక్ మెనారియా, వృద్ధిమాన్ సాహా, జలజ్ సక్సెనా, పియూష్ చావ్లా, భార్గవ్ భట్ , పంకజ్ సింగ్ , జయదేవ్ ఉనద్కట్ , సుదీంద్ర, యూసుఫ్ , ఆర్పీ సింగ్ .