For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీమిండియాపై వర్మ ట్వీట్: మీ సినిమాలన్నీ హిట్టే.. ఒమర్ కౌంటర్

By Srinivas

శ్రీనగర్: భారత జట్టు ఓటమి పైన సంచలన వ్యాఖ్య చేసిన రామ్ గోపాల్ వర్మకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్ని సమయాల్లో రాము సినిమాలు అలాగే బ్లాక్ బస్టర్ అవుతాయి కదా అని ఎద్దేవా చేశారు. మీ సినిమాలు ప్రతి సమయంలోను మంచి హిట్లవుతాయి.. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని సెటైర్ వేశారు.

 Omar Abdullah takes down Ram Gopal Varma after he tweets he's happy India lost

ట్విట్టర్‌లో వివాదాస్పద కామెంట్స్‌ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఈసారి క్రికెట్‌పై తన బాణాలు ఎక్కుపెట్టాడు. క్రికెట్‌ను విపరీతంగా ద్వేషించే రామ్ గోపాల్ వర్మ.. భారత్‌ ఓటమి నాకు చాలా ఆనందం కలిగించిందని, ఎందుకంటే నాకు క్రికెట్‌ అంటే ఇష్టముండదని, క్రికెట్‌ను అభిమానించేవారంటే అస్సలు ఇష్టం ఉండదని ట్వీట్‌ చేశాడు.

అలాగే క్రికెటైటిస్‌ అనే వ్యాధి నుంచి నా దేశ ప్రజలను కాపాడమని అందరి దేవుళ్లనీ ప్రార్థిస్తున్నానని మరో కామెంట్‌ చేశాడు. క్రికెట్‌ ఆడడం ఆపేంత వరకు భారత్‌ను అన్ని దేశాలు ఓడిస్తూనే ఉండాలి, ఆల్కహాల్‌, సిగరెట్‌లకు బానిసలైతే ఆ వ్యక్తే నష్టపోతాడని, కానీ క్రికెట్‌కు బానిసలైతే జాతి మొత్తం నిర్వీర్యమైపోతుందని ఘాటుగా విమర్శించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+