రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ మరోసారి రెచ్చిపోయాడు. ఇప్పటికే 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన బోల్ట్, గురువారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ సత్తా చాటాడు. 19.78 సెకన్లలోనే 200 మీటర్ల పరుగును పూర్తి చేసి రెండో స్వర్ణాన్ని గెలిచాడు.

ప్రత్యర్థులు అందుకోలేనంత వేగంతో బోల్ట్ తన లక్ష్యాన్ని చేధించాడు. దీంతో వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. తాజా స్వర్ణంతో ఉసేన్ బోల్ట్ హ్యాట్రిక్ స్వర్ణాన్ని సాధించినట్లైంది.
కాగా రియో ఒలింపిక్స్‌లో బోల్ట్‌కు ఇది రెండో స్వర్ణం. ఒలింపిక్స్‌లో ఉసేన్ బోల్ట్‌కు ఇది ఎనిమిదో స్వర్ణం కావడం విశేషం.