Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బయోపిక్‌.. కంగనా నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలదు: ద్యుతీ చంద్

Olympics star Dutee Chand wants Bollywood Star Kangana Ranaut to play her in biopic

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నా 'బయోపిక్‌' పాత్రకు పూర్తి న్యాయం చేయగలదు అని భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ అభిప్రాయపడ్డారు. ఒడిషాకు చెందిన ద్యుతీ చంద్ జీవితం ఆధారంగా త్వరలో బాలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్‌లో నటించే కథానాయిక మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. సినిమా హక్కుల కోసం చాలామంది నిర్మాతలు, నటీనటులు ద్యుతీని కలిసినా.. ఎవరికి అనుమతి ఇవ్వలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అనుమతి ఇవ్వలేదు:

అనుమతి ఇవ్వలేదు:

అయితే తన జీవితాన్ని సినిమాగా తీయడంపై ద్యుతి మీడియాతో మాట్లాడుతూ... 'తనపై బయోపిక్ తీయడానికి ఇప్పటికే అనేక మంది నిర్మాతలు సంప్రదించారు. సినిమా హక్కుల కోసం బాలీవుడ్‌కు చెందిన అనిల్ కపూర్, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా.. అనేక మంది నటీనటులు కలిశారు. అయినా ఎవరికి అనుమతి ఇవ్వలేదు' అని ద్యుతి తెలిపింది.

కంగనా ఒకే:

కంగనా ఒకే:

మీ పాత్రలో ఎవరు నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. 'కథను బట్టి కథానాయికను నిర్మాత, దర్శకులు ఎంచుకుంటారు. కథ సిద్ధం అయిన తరవాత ఎవరికి సరిగ్గా సరిపోతుందో చూడాలి. మేరీకోమ్, దంగల్, భాగ్ మిల్కా భాగ్ వంటి సినిమాలు చూశాను. మేరీకోమ్‌లో ప్రియాంక బాగా నటించారు. నా బయోపిక్‌లో ఎవరిని ఎంపిక చేస్తారో తెలీదు. కంగనా నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలదు అని అనుకుంటున్నా. ఆమె నటన అద్భుతం. ఓ నటిగా ఆమెను అభిమానిస్తాను' అని ద్యుతి పేర్కొంది. ప్రస్తుతం కంగనా తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు.

టీనేజ్ అమ్మాయితో సహజీవనం:

టీనేజ్ అమ్మాయితో సహజీవనం:

ఇటీవల ద్యుతీ చంద్‌ ఆటతోనే కాదు తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచారు. సమీప బంధువైన టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ద్యుతీ తల్లి అఖోజీ చంద్‌ స్పష్టం చేసింది. ద్యుతీ సోదరి సరస్వతి కూడా అమ్మాయితో సంబంధానికి అంగీకరించలేదు. మరోవైపు భయపెట్టడం, బ్లాక్‌మెయిల్‌ (రూ.25లక్షలు ఇవ్వాలని) చేయడం వంటివి సరస్వతి చేసిందని ద్యుతీ ఆరోపణలు చేసింది.

Story first published: Tuesday, June 25, 2019, 14:37 [IST]
Other articles published on Jun 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+