For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: మూడో రౌండ్‌కు మ‌నికా బాత్రా.. తొలి రెండు గేమ్‌ల‌ను కోల్పోయినా!!

Olympics 2020: Manika Batra beat Margaryta Pesotska to enters pre quarters in Table Tennis

టోక్యో: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మ‌నికా బాత్రా.. టోక్యో ఒలింపిక్స్ 2021లో దూసుకుపోతోంది. కాస్త కష్టపడినా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్‌లో ఆమె మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్‌లో 20వ సీడ్, ఉక్రెయిన్ ప్లేయ‌ర్ మార్గారిటా పెసోట్‌స్కాపై 4-3 తేడాతో విజ‌యం సాధించింది. 7 గేమ్స్‌లకు గానూ నాలుగు గేమ్స్‌లో ప్రత్యర్థిపై మణిక పైచేయి సాధించింది. దీంతో ఆమె ప్రీక్వార్టర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సోఫియా పోల్కనోవాతో మణిక తలపడనుంది.

ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన మ‌నికా బాత్రా.. తొలి రెండు గేమ్‌ల‌ను 4-11, 4-11తో కోల్పోయింది. ఆ తర్వాత మ‌నికా అద్భుతంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్‌ల‌ను 11-7, 12-10తో గెలుచుకుంది. మళ్లీ పెసోట్‌స్కా ఐదవ గేమ్‌ (8-11)లో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. మరోసారి సత్తాచాటిన మ‌నికా.. 6, 7 గేమ్స్‌లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గంట పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 తేడాతో మ‌నికా బాత్రా విజయాన్ని అందుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సోఫియా పోల్కనోవాతో మణిక తలపడనుంది. శనివారం జరిగిన తొలిరౌండ్‌లో మణిక బ్రిటన్‌పై 4-0తో గెలుపొందింది.

World Cadet Wrestling Championship : Priya Malik Clinches Gold For India | Oneindia Telugu

ఇండియాలో స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ టీమిండియాను చీర్ చేయ‌డానికి ఒలింపిక్ థీమ్‌తో ఉన్న మ‌ర్చండైజ్ కొన‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. దీంతో టీష‌ర్ట్స్‌, మ‌గ్గులు, బాటిల్స్ నుంచి మాస్కుల వ‌ర‌కూ విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా ఒలింపిక్ మాస్కుల‌కైతే డిమాండ్ మ‌రింత ఎక్కువ‌గా ఉందని త‌యారీదారులు అంటున్నారు. ఇప్ప‌టికే త‌మ మాస్కులు సక్సెస్ అయ్యాయ‌ని ఢిల్లీకి చెందిన మ‌ర్చండైస్ అనే స్టార్ట‌ప్ ఓన‌ర్ య‌ష్ గుప్తా చెప్పారు. మొద‌ట్లో ఇలాంటి 2 వేల మాస్కుల‌ను తాము త‌యారు చేశామ‌ని, అయితే రోజురోజుకూ బుకింగ్స్ మాత్రం విప‌రీతంగా పెరిగిపోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో కొంటున్న‌ట్లు చెప్పారు.

Story first published: Sunday, July 25, 2021, 14:28 [IST]
Other articles published on Jul 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+