రియో డి జనిరో: ఈ ఒలింపిక్స్‌లో చాలానే షాకింగ్ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. కానీ, తాజాగా చోటు చేసుకున్న ఈ మూమెంట్ మాత్రం అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, ఆ తర్వాత అందరూ సంబరిపోయారు కోచ్ తోపాటు.
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత అథ్లెట్లు పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవడం.. గెంతులేయడం సాధారణమే. అయితే స్వర్ణం గెలిచిన ఓ జపనీస్ అమ్మడు మాత్రం తన పతకానందాన్ని వినూత్నంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమే రెజ్లింగ్ ఫ్రిస్టయిల్ 63 కేజీల విభాగంలో జపనీస్ భామ రిసాకో కువాయి.

పసిడి గెలిచిన ఆనందంలో అభినందించడానికి కోచ్ ఆమె వద్దకు వచ్చిన
వెంటనే అతన్ని అమాంతం ఎత్తి మ్యాట్‌పై తిప్పిపడేసింది. అతను తేరుకునేలోపే మరోసారి తిప్పేసింది. అనంతరం జాతీయ జెండాను పట్టుకున్న కోచ్‌ను తన భుజాలపై కుర్చోబెట్టుకుని స్టేడియమంతా కలియతిరిగింది.
21ఏళ్ల కువాయికిది తొలి ఒలింపిక్స్. ఫైనల్‌లో ఆమె 3-0 తేడాతో బెలరూస్‌కు చెందిన మారియాపై గెలుపొంది స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కాగా, మాజీ రెజ్లర్ అయిన ఆమె కోచ్ కజుహిటో 1983-1989 మధ్య కాలంలో పలు పతకాలను గెలుచుకున్నాడు.