ఒలింపిక్ విజేత ఇంట్లో విషాదం
Olympic Medalist Bajrang Punia Father Passes Away: భారత రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, స్వతహా రెజ్లర్ అయిన ఆయన తండ్రి బల్వాన్ పూనియా సెప్టెంబర్ 11, గురువారం సాయంత్రం 6:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బజరంగ్ పూనియా తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న బల్వాన్ పూనియా గురువారం తుదిశ్వాస విడిచారు. గత 18 రోజులుగా బల్వాన్ పూనియా ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
బజరంగ్ పూనియా భావోద్వేగ పోస్ట్
"బాపుజీ ఇక మన మధ్య లేరు" అంటూ బజరంగ్ పూనియా భావోద్వేగంతో పోస్ట్ చేశారు. "మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. మా కుటుంబానికి ఆయన వెన్నెముక. ఆయన లేకుండా జీవితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు" అని పేర్కొన్నారు. బల్వాన్ సింగ్ పూనియా అంత్యక్రియలు సెప్టెంబర్ 12, శుక్రవారం ఉదయం 11 గంటలకు వారి స్వగ్రామమైన ఖుడన్‌లో జరుగుతాయని బజరంగ్ పూనియా వెల్లడించారు.

తండ్రి ప్రోత్సాహంతోనే రెజ్లింగ్‌లో విజయం
బజరంగ్ పూనియా తండ్రి బల్వాన్ పూనియా కూడా ఒకప్పుడు రెజ్లరే. చిన్నతనం నుంచే తన కుమారుడికి రెజ్లింగ్ మెలకువలు నేర్పించారు. తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాలతోనే బజరంగ్ పూనియా ప్రపంచస్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి దేశం గర్వపడేలా చేశారు. ఒక రెజ్లర్‌గా మారాలన్న బజరంగ్ కల, అతని తండ్రి ప్రోత్సాహంతోనే సాకారమైంది. తన పుత్రుడు ఒలింపిక్ మెడల్ సాధించినందుకు బల్వాన్ పూనియా పొంగిపోయి అందిరికి చెప్పుకుని మురిసిపోయాడు కూడా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications