
హైదరాబాద్: 2018లో జరిగే యూత్ ఒలింపిక్ గేమ్స్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రాచీన గ్రీస్ సాంప్రదాయ పద్దతిలో మంగళవారం నిర్వహించారు. ఏథెన్స్‌లోని ఒలింపిక్స్ సంఘం ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోని ప్రఖ్యాత పానాతెనాయిక్ స్టేడియంలో 1896 తొలిసారి మోడ్రన్ ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ఆచారం ప్రకారం ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించారు. అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏరిస్ వేదికగా 2018 యూత్ ఒలింపిక్స్ జరుగనునున్న సంగతి తెలిసిందే.
అర్జెంటీనా దేశ వ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో మొత్తం రెండు నెలల పాటు 14వేల కిలోమీటర్లు ఈ జ్యోతి ప్రయాణించనుంది. అనంతరం టోర్నీ ఆరంభానికి ముందు ఒలింపిక్స్ జ్యోతి రాజధాని బ్యునోస్ ఏరిస్ చేరుకుంటుంది. ఈ ఒలింపిక్ జ్యోతి ముఖ్య ఉద్దేశ్యం ప్రెండ్‌షిప్, గౌరవించడం, సమర్థతను పెంపొందించడమే.
ఉత్తమమైన సొసైటీ కోసం ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 6న ఆరంభమయ్యే ఈ యూత్ ఒలింపిక్స్ 18తో ముగియనున్నాయి. టోర్నీలో మొత్తం 36 క్రీడల్లో 241 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 206 దేశాల నుంచి 4వేల మంది క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్‌లో పోటీ పడనున్నారు.