Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దాదా ఉన్న కాలం స్వర్ణయుగం‌, అందుకే భారతరత్న

Dhyanchand-Sachin Tendulkar
భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌, సచిన్‌లకు భారతరత్న పురస్కారాన్ని సంయుక్తంగా ప్రకటించాలని మాజీ ఒలింపియన్స్‌ లెస్‌లై క్లౌడిస్‌, గురుబక్స్‌ సింగ్‌లు అభిప్రాయపడ్డారు. నేడు ధ్యాన్‌చంద్‌ 106వ జయంతి. ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడా అత్యున్నత పురస్కారాలు రాజీవ్‌ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేస్తారు. ధ్యాన్‌చంద్‌ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కాలం హాకీకి స్వర్ణయుగం.

ధ్యాన్‌చంద్‌ కెప్టెన్సీలో భారత్‌ హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్‌ (1928 అమ్‌స్టర్‌డమ్‌, 1932 లాస్‌ఎంజెల్స్‌, 1936 బెర్లిన్‌) స్వర్ణం సాధించింది. ధ్యాన్‌చంద్‌ సెంటర్‌ఫార్వర్డ్‌ ఆటగాడిగా జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలు అందించాడు. బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్‌ ఆటకు జర్మనీ నియంత అడల్ఫ్‌ హిట్లర్‌ ముగ్గుడయ్యాడు. బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో 12 మ్యాచ్‌ల్లో ధ్యాన్‌చంద్‌ 33 గోల్స్‌ చేశాడు. డ్రిబ్లింగ్‌లో ధ్యాన్‌చంద్‌ దిట్ట. 1959లో జాతీయజట్టుకు ధ్యాన్‌చంద్‌ కోచ్‌గా సేవలందించాడు. ధ్యాన్‌చంద్‌ కెరీర్‌లో సుమారు వెయ్యి గోల్స్‌ చేశాడు. 'దాదా (ధ్యాన్‌చంద్‌) భారత అత్యున్నత పురస్కారానికి అర్హుడు. సచిన్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ద్యాన్‌చంద్‌ తర్వాత సచిన్‌కు ఇవ్వాలంటున్నాను' అని గురుబక్స్‌ సింగ్‌ తెలిపాడు.

1963లో ధ్యాన్‌చంద్‌ ఛీఫ్‌ కోచ్‌గా గురుబక్స్‌ సింగ్‌ కెప్టెన్సీలో భారత హాకీ జట్టు ఫ్రాన్స్‌లో లియోన్స్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ నెగ్గింది. దాదా క్రమశిక్షణ గల కోచ్‌ అని ఫిట్‌నెస్‌ విషయంలో అసలు రాజీపడేవాడుకాదని సింగ్‌ తెలిపాడు. ప్రస్తుతం గాయాలతో కూడా ఆటగాళ్ళు జట్టులో చోటు దక్కించుకోవడం విచారకరం అన్నాడు. ధ్యాన్‌చంద్‌ భారత క్రీడారంగంలో అత్యున్నత క్రీడాకారుడన్నాడు. సాకర్‌కు ఫిలే, క్రికెట్‌కు బ్రాడ్ మెన్ ఎలాగో హాకీకి ధ్యాన్‌చంద్‌ దిగ్గజం అని తెలిపాడు. 1956లో ధ్యాన్‌చంద్‌కు భారత మూడో అత్యున్నత పురస్కారమైన పద్మఅవార్డ్‌తో సత్కరించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+