న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫొటోలు వైరల్: నగ్నంగా వెడ్డింగ్ జరుపుకున్న జంట.. ఎవరో తెలుసా?!!

Olivia Buckland and Alex Bowen strip totally naked to celebrate their one year wedding anniversary

హైదరాబాద్: మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ప్రతి ఒక్క జంట ఘనంగా జరుపుకుంటారు. హోటల్, రెస్టారెంట్, పబ్, ఫేవరేట్ ప్లేస్ ఇలా తమకు నచ్చిన చోట నచ్చినట్టు జరుపుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ.. యూకేకి చెందిన మోడల్ రంగానికి చెందిన ఓ జంట ఓ అడుగు ముందుకేసి వినూత్నంగా జరుపుకున్నారు. ఆ జంట నగ్నంగా తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని వార్తల్లో నిలిచారు.

దక్షిణాఫ్రికా vs భారత్‌: పంత్‌కి ఆఖరి ఛాన్స్.. నిరూపించుకోకపోతే ఇక అంతే!!దక్షిణాఫ్రికా vs భారత్‌: పంత్‌కి ఆఖరి ఛాన్స్.. నిరూపించుకోకపోతే ఇక అంతే!!

ఒలివియా బక్లాండ్ (25) యూకేకి చెందిన మోడల్, టీవీ ఇంగ్లీష్ రియాలిటీ టెలివిజన్ యాంకర్. అలెక్స్ బోవెన్ (27) ఇంగ్లీష్ మోడల్. ఈ ఇద్దరు 2016లో 'లవ్ ఐలాండ్' షో రెండవ సిరీస్‌లో పాల్గొన్నారు. అనంతరం ఇద్దరూ తరచూ కలుసుకోవడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది.

ఇద్దరు గత ఏడాది సెప్టెంబర్‌లో ఎసెక్స్‌లోని గోస్ఫీల్డ్ హాల్‌లో కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఈ జంట సొసైటీలోని తమ స్థాయికి తగ్గట్టుగా విలాసవంతమైన జీవితం గడుపుతోంది.

ఒలివియా బక్లాండ్, అలెక్స్ బోవెన్‌లకు వివాహం అయి సంవత్సరం అయింది. ఈ సందర్భంగా ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవాన్ని శాంటోరినిలో విలాసవంతమైన విల్లాలో జరుపుకున్నారు. అయితే ఇద్దరు సముద్రం ఒడ్డులోని విల్లాలో పూర్తి నగ్నంగా ఉండి జరుపుకోవడం విశేషం.

ఒలివియా సముద్రం ఎదురుగా నిలబడి నగ్నంగా ఫొటోలకు ఫోజిచ్చింది. అంతేకాదు ఈ పోటోలను అభిమానులతో పంచుకుంది. 'వివాహం అయిన తరువాతి సంవత్సరం' అని రాసుకొచ్చింది. ఈ పోటోలను తీయడానికి వారు సెల్ఫ్ టైమర్ ఉపయోగించారని ఒలివియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ పోటీలను తెగ షేర్ చేస్తున్నారు.

Story first published: Wednesday, September 18, 2019, 16:25 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X