శాయ్‌లో కీచక కోచ్‌లు.. పెరుగుతున్న సెక్సువల్ హరాస్‌మెంట్ కేసులు

న్యూఢిల్లీ: మేటి క్రీడాకారులను తీర్చిదిద్ది విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) కీచక పర్వాలకు అడ్డగా మారింది. 24 అసోసియేషన్‌ల సమహారంగా ఉన్న శాయ్‌.. కీచక కోచ్‌ల వల్ల అప్రతిష్ట పాలవుతోంది. ద్రోణచార్యుడి పాత్రలో శిష్యులను తీర్చిదిద్దాల్సిన కోచ్‌లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అసాంఘిక కార్యకలపాలకు పాల్పడటం దేశ క్రీడాలోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇండియన్ ఎక్స్ ప్రెస్ సేకరించి వెల్లడించిన విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

దశాబ్ధ కాలంలో 45 కేసులు

దశాబ్ధ కాలంలో 45 కేసులు

గత దశాబ్దకాలంలో శాయ్‌లో మొత్తం 45 సెక్సువల్ హరాస్ మెంట్ కేసులు నమోదవ్వగా.. అందులో 29 కేసులు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ వంటి క్రీడలకు సంబంధించిన కోచ్‌లపై నమోదయ్యాయి. ఇవి మచ్చుకు కొన్నేనని బయటికి చెప్పుకోలేని బాధితులు ఎంతో మంది ఉన్నారని 2018-19లో శాయ్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నీలమ్ కపూర్ తెలిపారు.

చెప్పుకోలేని వారెంతో మంది..

చెప్పుకోలేని వారెంతో మంది..

తాను బాధ్యతలు స్వీకరించే సమాయానికి పెండింగ్‌లో ఉన్న లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్యను చూసి షాక్ అయ్యానని, దీనికి మన కల్చరే కారణమని నీలమ్ కపూర్ తెలిపారు. ‘వాస్తవానికి ఈ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేధింపులకు గురైన ప్రతీ ఒక్కరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. కంప్లైట్ చేస్తే ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయపడతారు. దీంతో చాలా మంది శిక్ష పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఫిర్యాదులను వెంటనే విచారించి చర్యలు తీసుకుంటే బాధితులకు వ్యవస్థపై నమ్మకం కలుగుతోంది.'అని చెప్పుకొచ్చారు.

నామమాత్రపు శిక్షలతో..

నామమాత్రపు శిక్షలతో..

ఇక ఎలాంటి శిక్ష విధించకుండా అనేక మంది నిందితులను వదిలేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో ప్రచురించింది. ఒకవేళ శిక్ష విధించినా.. ట్రాన్స్‌ఫర్‌లు, జీతం, పెన్షన్‌లో ‌కోతతో సరిపెట్టారంది. అంతేకాకుండా అనేక ఫిర్యాదులు ఏళ్ల తరబడి విచారించారని పేర్కొంది.

హిసార్ సెంటర్‌లో ఐదుగురు మైనర్ ట్రైనీలను బలవంతంగా ముద్దుపెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ కోచ్‌పై చర్యలు తీసుకోవడానికి శాయ్‌కు మూడేళ్లు పట్టిందని ఊదహారణగా పేర్కొంది. కోచ్ దోషిగా తేలిన తరువాత, ఒక సంవత్సరం పెన్షన్లో 10 శాతం కోత విధించి వదిలిపెట్టారంది. మరొక కేసులో, దోషిగా తేలిన కోచ్ జీతంలో నెలకు రూ .910 తగ్గింపుతో జరిమానా విధించారంది. తమ దర్యాప్తులో వెల్లడైన విషయాల గురించి స్పందించడానికి శాయ్ నిరాకరించిందని పేర్కొంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 17, 2020, 13:33 [IST]
Other articles published on Jan 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X