Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదేళ్ల తర్వాత మళ్లీ టైగర్ వచ్చి.. విజేతగా నిలిచి..

Now that Tiger is out of the woods, will endorsement deals follow?

న్యూ ఢిల్లీ: వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు.. మరోవైపు గాయాల బాధలు.. రెంటి మధ్య ఉక్కిరి బిక్కిరి అయి ఆటలో పాతాళానికి పడిపోయిన దిగ్గజ గోల్ఫర్‌ టైగర్‌వుడ్స్‌ ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతను అంతర్జాతీయ టైటిల్‌ సాధించాడు. ఈస్ట్‌ లేక్‌ టూర్‌ ఛాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు.

ఫైనల్లో టైగర్‌ 269 పాయింట్లతో ప్రత్యర్థుల్ని వెనక్కి నెట్టాడు. చివరగా అతను 2013లో పీజీఏ టైటిల్‌ గెలిచాడు. మొత్తంగా 80వ టైటిల్‌. 82 టైటిళ్లతో సామ్‌ స్నీడ్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డును టైగర్‌ ఎప్పుడో బద్దలు కొట్టేస్తాడని అంతా అనుకున్నారు. ఐతే కొన్నేళ్ల కిందట టైగర్‌ విశృంఖల శృంగార కార్యకలాపాలన్నీ బయటపడటంతో అతడి వ్యక్తిగత జీవితం కుదుపునకు లోనైంది. టైగర్‌ భార్య అతడి నుంచి విడిపోయింది.

ఈ గొడవలకు తోడు గాయాలు కూడా టైగర్‌ను కిందికి లాగాయి. దీంతో అతను ఐదేళ్లుగా 79 టైటిళ్ల మీదే ఉండిపోయాడు. ఎట్టకేలకు మరో టైటిల్‌ జమ చేశాడు. ఈ ఊపులో త్వరగానే ఇంకో మూడు టైటిళ్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడని టైగర్‌ అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు సాధించిన విజయాన్ని ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి జరుపుకున్నాడు.

విజేత టైగర్ వుడ్స్ అని తెలియగానే గేమ్ చూసేందుకు వచ్చిన అభిమానుల ముందే ప్రేమగా ముద్దాడాడు. ఇటువంటి విజయం కోసం ఐదేళ్ల పాటు నిరీక్షించిన టైగర్ వుడ్స్ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని పునరాగమనంతో పాటు వారిద్దరూ ముద్దాడిన దృశ్యాలు, విజయానందంలో టైగర్ వుడ్స్ కంటతడి పెట్టుకోవడంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Story first published: Tuesday, September 25, 2018, 12:59 [IST]
Other articles published on Sep 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+