Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఆటలో సాంకేతిక లోపాలు లేవు: పుజారా

చెన్నై: తన ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని భారత క్రికెట్‌ ఏ-జట్టు కెప్టెన్‌ ఛటేశ్వర్ పుజారా అన్నాడు. ఇంగ్లాండ్‌లో యార్క్‌షైర్‌ తరఫున కౌంటీల్లో ఆడిన పుజారా ఆధునిక క్రికెట్‌లో ఆడటానికి మానసికంగా సిద్ధమైనట్లు పేర్కొన్నారు.

గతంలో భారత జట్టుతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌ పర్యటనలకు వెళ్లిన పుజారా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌ పిచ్‌లలో నిలకడగా ఆడలేడని క్రికెట్‌ విశ్లేషకులు విమర్శించడంతో పుజారా పైవ్యాఖ్యలు చేశాడు.

బుధవారం చెన్నైలో ఆస్ట్రేలియా ఏ టీంతో పూజరా నేతృత్వంలో భారత్‌ అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో విఫలమవడంతో పుజారా.. టీమిండియాలో చోటు కోల్పోయాడు.

Nothing wrong with my technique, says Cheteshwar Pujara

ఇటీవల కౌంటీ యార్క్‌షైర్ తరపున ఆడిన పుజారా తనలో మోడర్న్ క్రికెట్ ఆడగల సత్తా వుందని చెప్పాడు. త్వరలోనే తాను తిరిగి భారత జట్టులోకి వస్తాననే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తనలో సానుకూల దృక్పథాన్ని పెంచాడని తెలిపాడు. ద్రావిడ్ ఒక మంచి గురువు అని చెప్పాడు. అతని సూచనలతో మరింతగా రాణిస్తామని చెప్పాడు. యువ ఆటగాళ్లకు రాహుల్ సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+